డాలస్‌లో జగన్ రాక కోసం.. ప్రవాసుల ఎదురుచూపు

| Edited By:

Aug 15, 2019 | 2:44 AM

ఏపీ సీఎం జగన్‌ రాక కోసం అమెరికాలోని తెలుగు వారంతా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటిస్తారు. జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులంతా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 17వ తేదీన డాలస్‌లోని కే బెయిలీ హాచిసన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రసాసాంధ్రులను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ సభను జయప్రదం చేసేందుకు ప్రవాసాంధ్రులు పార్టీలకు అతీతంగా సన్నాహాలు చేస్తున్నారు. తెలుగువారంతా ఆనాటి సభకు తరలి రావాలని నిర్వాహకులు […]

డాలస్‌లో జగన్ రాక కోసం.. ప్రవాసుల ఎదురుచూపు
Follow us on

ఏపీ సీఎం జగన్‌ రాక కోసం అమెరికాలోని తెలుగు వారంతా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటిస్తారు. జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులంతా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 17వ తేదీన డాలస్‌లోని కే బెయిలీ హాచిసన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రసాసాంధ్రులను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ సభను జయప్రదం చేసేందుకు ప్రవాసాంధ్రులు పార్టీలకు అతీతంగా సన్నాహాలు చేస్తున్నారు. తెలుగువారంతా ఆనాటి సభకు తరలి రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. జగన్‌ సభ సన్నాహాల కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో IANT, తానా, ఆటా, నాటా, టీపాడ్‌, నాట్స్‌, డాటా, AAPI తదితర తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.