Update: అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న ఆస్ట్రాయిడ్‌ గ్రహశకలం

| Edited By: Ravi Kiran

Aug 27, 2020 | 8:23 PM

Update: ”అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న ఆస్ట్రాయిడ్‌ గ్రహశకలం” అని ఇంతకముందు మేము చేసిన పోస్ట్ లో.. 2018VP1 అనే గ్రహశకలం నవంబర్ 2న భూమికి అత్యంత దగ్గరగా అంటే.. 482 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని.. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం 0.41 శాతం ఉందని.. ఒకవేళ గ్రహశకలం భూమిని తాకితే ప్రళయమే అని రాశాం. అయితే నాసా ఆస్ట్రాయిడ్ వాచ్.. 2018 VP1 గ్రహశకలం చాలా చిన్నదని (సుమారు రెండు […]

Update: అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న ఆస్ట్రాయిడ్‌ గ్రహశకలం
Follow us on

Update: ”అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న ఆస్ట్రాయిడ్‌ గ్రహశకలం” అని ఇంతకముందు మేము చేసిన పోస్ట్ లో.. 2018VP1 అనే గ్రహశకలం నవంబర్ 2న భూమికి అత్యంత దగ్గరగా అంటే.. 482 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని.. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం 0.41 శాతం ఉందని.. ఒకవేళ గ్రహశకలం భూమిని తాకితే ప్రళయమే అని రాశాం. అయితే నాసా ఆస్ట్రాయిడ్ వాచ్.. 2018 VP1 గ్రహశకలం చాలా చిన్నదని (సుమారు రెండు మీటర్లు), దాని వల్ల భూమికి ఎటువంటి ప్రమాదం లేదని సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ఆ గ్రహశకలం భూమి వాతావరణంలోకి రావడానికి కేవలం 0.41 శాతం అవకాశం ఉందని.. ఒక వేళ భూమి వాతావరణంలోకి ప్రవేశించినా, అది చాలా చిన్నగా ఉండడం వల్ల వాతావరణంలోనే విచ్ఛిన్నమవుతుంది అని తెలిపింది. అందువల్ల ఇంతకముందు మేము చేసిన పోస్ట్ లో గ్రహశకలం భూమిని తాకితే ప్రళయమే అని చెప్పింది తప్పు అని గమనించగలరు.

అమెరికా ఎన్నికల ముందు ఓ పిడుగు లాంటి వార్త చెప్పింది నాసా. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒకరోజు ముందు భూమిని ఓ ఆస్ట్రాయిడ్‌ ఢీకొట్టబోతోందని ప్రకటించింది. 2018లోనే ఈ గ్రహ శకలాన్ని గుర్తించిన నాసా.. వచ్చే నవంబర్‌లో భూమిని తాకబోతోందని తెలియడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, నవంబర్‌ 3న అమెరికాలో అధ్యక్షఎన్నికలు జరగుతున్న ముందురోజే భూమిని తాకుతుందడడం విశేషం. అగ్రరాజ్యానికి ఇప్పుడు ఆస్ట్రాయిడ్‌ భయం పట్టుకుంది. ఆ గ్రహశకలం పేరు 2018VP1. దీన్ని కాలిఫోర్నియాలోని పల్మొనార్ అబ్జర్వేటరీలో 2018లో నాసా గుర్తించింది. ఈ గ్రహశకలం నవంబర్ 2న భూమికి అత్యంత దగ్గరగా అంటే.. 482 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందనే అంచనా వేస్తున్నారు నాసా శాస్ర్తవేత్తలు. ఈ అంచనా కరెక్ట్ అయితే భూమికి ఎలాంటి హానీ జరగదు. కానీ ఒకవేళ గ్రహశకలం భూమిని తాకితే ప్రళయమే జరిగే ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం 0.41 శాతం మాత్రమేనని నాసా చెప్పింది. ఈ లెక్క తప్పి గ్రహశకలం ఢీకొడితే… అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబర్ 3కి ముందురోజే ప్రళయం సంభవించే ప్రమాదం ఉంది.

కొన్ని రోజుల కిందట కారు సైజున్న గ్రహశకలం ఒకటి… భూమివైపు వచ్చి వెళ్లిపోయింది. అది వెళ్లిన తర్వాతే నాసా శాస్త్రవేత్తలు దాన్ని గుర్తించారు. ఆ గ్రహశకలం చిన్నదే అయినా.. చాలా గట్టిగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈనెల 16వ తేదీ ఆదివారం రాత్రి… హిందూ మహాసముద్రంపై 3వేల కిలోమీటర్ల ఎత్తులో ఆ గ్రహశకలం వెళ్లింది. అయితే అది భూమిని ఢీకొట్టపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇప్పుడు నవంబర్‌ 2న భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్న ఆస్ట్రాయిడ్‌ భారీ నష్టాన్ని మిగుల్చుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.