అమెరికాలో కోటి పందులు చంపేందుకు సిద్ధం.. ఎందుకంటే..!

| Edited By:

May 19, 2020 | 8:47 PM

ఓ వైపు కరోనా నేపథ్యంలో అమెరికాలో ఆకలికేకలు మిన్నంటుతుంటే.. మరోవైపు అక్కడి ఫాంహౌజ్‌ల యజమానులు కోళ్లు, పందులు చంపేందుకు సిద్దమవుతున్నారు.

అమెరికాలో కోటి పందులు చంపేందుకు సిద్ధం.. ఎందుకంటే..!
Follow us on

ఓ వైపు కరోనా నేపథ్యంలో అమెరికాలో ఆకలికేకలు మిన్నంటుతుంటే.. మరోవైపు అక్కడి ఫాంహౌజ్‌ల యజమానులు కోళ్లు, పందులు చంపేందుకు సిద్దమవుతున్నారు. కబేళాల్లో పనిచేసే కార్మికులకు కరోనా సోకుందన్న కారణంగా.. అక్కడ కబేళాలు మూసేశారు. ఈ క్రమంలో బీఫ్, పోర్క్‌ కబేళాల సామర్థ్యం 25 శాతం, 40 శాతం తగ్గిపోయి.. మాంస ఉత్పత్తుల సరఫరా దారుణంగా దెబ్బతింది. మరోవైపు ఫాంహౌజ్‌లలో కోళ్లు, పశువుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వాటిని పెంచి నష్టాలు తెచ్చుకోవడం కంటే.. చంపేసి చేతులు దులుపుకోవాలని యజమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ మధ్యన కోటి కోళ్లను మంటలను ఆర్పడానికి ఉపయోగించే ఫోమ్‌తో ఊపిరాడకుండా చేసి చంపేయగా.. సెప్టెంబర్ నాటికి పందులను చంపేయబోతున్నట్లు పోర్క్ ఇండస్ట్రీ ప్రకటించింది. ఇక అమానవీయమైన పద్దతులతో వీటిని చంపబోతున్నట్లు తెలుస్తోంది. గ్యాస్‌ వదలడం, కాల్పులు జరపడం, మత్తుమందు అధికంగా ఇవ్వడం, బరువైన వస్తువుతో ఒక్కసారిగా మోదడం వంటి పద్దతులు ఉపయోగించబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ కారణంగా అక్కడి ప్రజలు ఫుడ్‌ బ్యాంక్‌ల వద్ద మైళ్ల మేర క్యూ కట్టారు.

Read This Story Also: అదేంటో నా పెళ్లి గురించి నాకే చివర్లో తెలుస్తోంది..!