హ్యూస్టన్ సభలో ప్రధాని మోదీ నోట.. తెలుగు మాట..!

| Edited By:

Sep 23, 2019 | 12:53 AM

అమెరికా హ్యూస్టన్‌ ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో హౌడీ-మోదీ సభకు పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు హాజరయ్యారు. అయితే అంత పెద్ద సభలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. ఈ కార్యక్రమం పేరు హౌడీ మోదీ అని.. అయితే అంతా బాగుందని తెలుగులో చెప్పారు. అయితే కేవలం తెలుగులోనే మాత్రం కాదు.. దేశంలోని పలు భాషలలో అంతా బాగుందంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అదే అంశాన్ని ట్రంప్‌కు తెలియజేశారు. భారత్‌లోని పలు భాషాల్లో అంతా బాగుందని దాని అర్ధం అని […]

హ్యూస్టన్ సభలో ప్రధాని మోదీ నోట.. తెలుగు మాట..!
Follow us on

అమెరికా హ్యూస్టన్‌ ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో హౌడీ-మోదీ సభకు పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు హాజరయ్యారు. అయితే అంత పెద్ద సభలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. ఈ కార్యక్రమం పేరు హౌడీ మోదీ అని.. అయితే అంతా బాగుందని తెలుగులో చెప్పారు. అయితే కేవలం తెలుగులోనే మాత్రం కాదు.. దేశంలోని పలు భాషలలో అంతా బాగుందంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అదే అంశాన్ని ట్రంప్‌కు తెలియజేశారు. భారత్‌లోని పలు భాషాల్లో అంతా బాగుందని దాని అర్ధం అని తెలిపారు. తనకు అపూర్వ స్వాగతం లభించిందంటూ ఆయన హ్యూస్టన్‌ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌ పేరు తెలియని వారు ప్రపంచంలో ఎవరూ లేరన్న మోదీ.. ప్రతి 10 మంది సంభాషణలో ట్రంప్‌ ఉంటారని, వ్యాపారం నుంచి రాజకీయాల వరకు అన్నింట్లో ట్రంప్‌ సుపరిచితులే అని అన్నారు. అంతేకాదు మరోసారి అధ్యక్ష పదవిని ట్రంప్ చేపట్టాలని ఆకాంక్షిస్తున్నానని.. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ వ్యాఖ్యానించారు.