America Covid-19: అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. జనవరిలో రికార్డు స్థాయిలో మరణాలు

|

Jan 29, 2021 | 5:35 AM

America Covid-19: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. జనవరిలో రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం

America Covid-19: అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. జనవరిలో రికార్డు స్థాయిలో మరణాలు
Covid-19 Deaths
Follow us on

America Covid-19: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. జనవరిలో రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసులు, మరణాలు అధికంగానే నమోదవుతున్నాయి. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరిలోనే మంగళవారం నాటికి 79 వేల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా, గత నెలలో 77 వేల మంది మృతి చెందారు. ఈ నెలలో ఇప్పటికే ఆ రికార్డు చెరిపేసింది.

అమెరికాలో కరోనా విజృంభణ మొదలైన నాటి నుంచి ఒకే నెలలో ఈ స్థాయిలో మరణాలు నమోదు కాలేదు. ఇదిలా ఉంటే యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ దాదాపు 28 రాష్ట్రాలకు పాకినట్లు సీడీసీ వెల్లడించింది. అంతేకాకుండా రాబోయే మూడు వారాల్లో అమెరికాలో దాదాపు 80 వేల కరోనా మరణాలు సంభవించే అవకాశం ఉందని సీడీసీ అంచనా వేసింది. కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 2.61 కోట్ల వరకు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 4.40 లక్షల మరణాలు నమోదయ్యాయి.

Also Read: Corona Cases India: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 11,666 పాజిటివ్ కేసులు, 123 మరణాలు..