టెక్సాస్‌లో విమాన ప్రమాదం.. పది మంది మృతి

| Edited By:

Jul 01, 2019 | 9:27 AM

అమెరికాలో విషాదం చోటుచేసకుంది. టెక్సాస్ నగరంలో ఓ చిన్న ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురై.. పదిమంది మరణించారు. టెక్సాస్ మున్సిపల్ విమానాశ్రయం నుంచి బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్-350 ప్రైవేటు విమానం టేకాప్ అయిన కాసేపట్లోనే హ్యాంగర్ ఢీకొట్టింది. దీంతో విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పదిమంది కాలి బూడిదయ్యారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపు చేశారు. విమానం టేకాఫ్‌ సమయంలో హ్యాంగర్‌ను ఎందుకు ఢీకొందన్న కోణంలో […]

టెక్సాస్‌లో విమాన ప్రమాదం.. పది మంది మృతి
Follow us on

అమెరికాలో విషాదం చోటుచేసకుంది. టెక్సాస్ నగరంలో ఓ చిన్న ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురై.. పదిమంది మరణించారు. టెక్సాస్ మున్సిపల్ విమానాశ్రయం నుంచి బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్-350 ప్రైవేటు విమానం టేకాప్ అయిన కాసేపట్లోనే హ్యాంగర్ ఢీకొట్టింది. దీంతో విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పదిమంది కాలి బూడిదయ్యారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపు చేశారు. విమానం టేకాఫ్‌ సమయంలో హ్యాంగర్‌ను ఎందుకు ఢీకొందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన సమయంలో హ్యంగర్‌లో ఎవరూ లేనట్లు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేర్కొంది.