లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఐఐటీ, జెఈఈ, నీట్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అయితే.. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ విద్యార్థుల చదువుకు

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఐఐటీ, జెఈఈ, నీట్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 30, 2020 | 5:18 PM

AI-based online exams: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అయితే.. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగిస్తోంది.. ఇలాంటి సమయంలో విద్యార్థులకు ఐఐటి, జెఈఈ, నీట్‌ పరీక్షలకు హాజరయ్యేవారికి.. ఇంట్లోనే వారికి శిక్షణ ఇచ్చేలా లెర్నింగ్‌ ట్రీ సంస్థ ఏఐ(AI) ఆధారిత ఆన్‌లైన్ పరీక్షా వేదికను ప్రారంభించింది. తెలంగాణ ఇండస్ట్రీస్‌, కామర్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న ఈ సేవలు మంచి ప్రయోజనం ఇస్తుందన్నారు లెర్నింగ్ ట్రీ సీఈఓ శశికాంత్.