ప్రపంచ వయో వృద్ధుడు ‘బాబ్’ కన్నుమూత..!

| Edited By:

May 29, 2020 | 10:02 AM

ప్రపంచ కురవృద్ధుడు బాబ్ వెయిటన్(112) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బాబ్ గురువారం తుది శ్వాస విడిచారు.

ప్రపంచ వయో వృద్ధుడు బాబ్ కన్నుమూత..!
Follow us on

ప్రపంచ వయో వృద్ధుడు బాబ్ వెయిటన్(112) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బాబ్ గురువారం తుది శ్వాస విడిచారు. బాబ్ మరణవార్తను కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ‘అద్భుతమైన వ్యక్తి  క్యాన్సర్‌తో నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లారు’ అని బాబ్ కుటుంబసభ్యులు వెల్లడించారు.

కాగా 1908 మార్చి 29న బ్రిటన్‌ ఈస్ట్‌ యార్క్‌షైర్‌లోని హుల్‌లో బాబ్ వెయిటన్ జన్మించారు. తైవాన్‌, జపాన్, కెనడాలో ఆయన ఇంజనీర్‌గా పనిచేశారు. అంతేకాదు తన జీవితకాలంలో 26 మంది బ్రిటన్ ప్రధానుల పరిపాలనను బాబ్‌ చూశారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో బాబ్ పుట్టినరోజు వేడుకలను ఇంట్లోనే జరుపుకున్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక చిన్న వైరస్‌తో ప్రపంచమంతా ఎంత అతలాకుతమైందని బాబ్ మాట్లాడినట్లు వారు చెప్పారు. కాగా జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబే 112 సంవత్సరాల 355 రోజుల వయసులో 23 ఫిబ్రవరి 2020న మృతి చెందడంతో.. బ్రిటన్‌కు చెందిన బాబ్ వెయిటన్ ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందారు.

Read This Story Also: వడగాలులు.. తెలంగాణలో ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..!