మలేరియాకి వ్యాక్సిన్ వచ్చేసింది..

|

Apr 24, 2019 | 7:13 PM

 మలేరియా బారిన పడకుండా  అడ్డుకునే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను ఆఫ్రికా శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఆఫ్రికాలో ఈ వ్యాక్సిన్‌పై పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు. కాగా మలేరియాకి విరుగుడు వ్యాక్సిన్ కనుగునేందుకు శాస్రవేత్తలు 30 ఏళ్ల పాటు పరిశోధనలు నిర్వహించారు. రోగకారక క్రిమిలోని సూక్ష్మకణాలపై ఆధారపడి పనిచేయడం వల్ల ఇప్పటివరకు వంద శాతం ఫలితాన్నివ్వడంలో విఫలమవుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ల ప్రభావాన్ని మరింత మెరుగు పరిచే దిశగా చేసిన కృషి ఫలితమే ఈ తాజా వ్యాక్సిన్‌ అని చెప్పారు. పిల్లల్లో మలేరియాను […]

మలేరియాకి వ్యాక్సిన్ వచ్చేసింది..
Follow us on

 మలేరియా బారిన పడకుండా  అడ్డుకునే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను ఆఫ్రికా శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఆఫ్రికాలో ఈ వ్యాక్సిన్‌పై పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు. కాగా మలేరియాకి విరుగుడు వ్యాక్సిన్ కనుగునేందుకు శాస్రవేత్తలు 30 ఏళ్ల పాటు పరిశోధనలు నిర్వహించారు. రోగకారక క్రిమిలోని సూక్ష్మకణాలపై ఆధారపడి పనిచేయడం వల్ల ఇప్పటివరకు వంద శాతం ఫలితాన్నివ్వడంలో విఫలమవుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ల ప్రభావాన్ని మరింత మెరుగు పరిచే దిశగా చేసిన కృషి ఫలితమే ఈ తాజా వ్యాక్సిన్‌ అని చెప్పారు. పిల్లల్లో మలేరియాను గణనీయంగా నివారించేందుకు ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఘనా మరియు కెన్యా దేశాల్లో కొద్ది వారాల్లోనే ఈ వ్యాక్సిన్ ప్రవేశపెట్టబోతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. కాగా 2017వ సంవత్సరంలో ప్రపంచ మలేరియా సంబంధిత మరణాల్లో..93 శాతం ఆఫ్రికా దేశంలోనే నమోదవ్వడం గమనార్హం.