రాక్షసి కాదు పక్షే.. ప్రాణాలు తీసింది

| Edited By: Ravi Kiran

Apr 15, 2019 | 6:31 PM

ప్రపంచంలోనే అరుదైన సంఘటన ఇది. పక్షి చేసిన దాడిలో దాని యజమానే మరణించిన ఘటన ఫ్లోరిడాలో జరిగింది. అరుదైన కాసోవేరి అనే ఏమూ జాతికి చెందిన పక్షి.. మార్విన్ హాజోస్ అనే 75ఏళ్ల వృద్ధుడు ఆహారం వేస్తుండగా.. హఠాత్తుగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురై మార్విన్ అక్కడికక్కడే కన్నుమూశాడు. అతి ప్రమాదకరమైన ఈ పక్షి 6 అడుగుల పొడవు, 60కేజీల బరువు ఉంటుందని పక్షి శాస్త్రఙ్ఞులు చెబుతున్నారు. దీని ప్రతి కాలికి కత్తుల్లాంటి […]

రాక్షసి కాదు పక్షే.. ప్రాణాలు తీసింది
Follow us on

ప్రపంచంలోనే అరుదైన సంఘటన ఇది. పక్షి చేసిన దాడిలో దాని యజమానే మరణించిన ఘటన ఫ్లోరిడాలో జరిగింది. అరుదైన కాసోవేరి అనే ఏమూ జాతికి చెందిన పక్షి.. మార్విన్ హాజోస్ అనే 75ఏళ్ల వృద్ధుడు ఆహారం వేస్తుండగా.. హఠాత్తుగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురై మార్విన్ అక్కడికక్కడే కన్నుమూశాడు.

అతి ప్రమాదకరమైన ఈ పక్షి 6 అడుగుల పొడవు, 60కేజీల బరువు ఉంటుందని పక్షి శాస్త్రఙ్ఞులు చెబుతున్నారు. దీని ప్రతి కాలికి కత్తుల్లాంటి నాలుగు గోళ్లు ఉంటాయి. వాటితో తన ప్రత్యర్థిని అవలీలగా చంపగలవని పక్షి నిపుణులు అంటారు. ఇవి గాలిలో ఏడు అడుగుల ఎత్తు వరకు ఎగరగలవని.. నీటిలో సునాయాసంగా ఈదగలవని కూడా చెప్తుంటారు. దట్టమైన అడవుల్లో కూడా గంటకు 31మైళ్ల వేగంతో పరుగెత్తగల సత్తా వీటి సొంతమని వారు అంటున్నారు.

అమెరికాలో ఆహారం కోసం కాకుండా పలువురు పక్షి ప్రియులు వీటిని పెంచుకోవడం పట్ల మక్కువ చూపుతారు. అందుకే వీటిని పెంచే యజమానులు పలు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, అనుభవం కూడా కలిగి ఉండాలని పక్షి నిపుణులు చెబుతుంటారు.