WHO Team Tour: ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందంతో సమావేశం అవుతాం.. వూహాన్‌ వాసుల డిమాండ్‌తో ఉలిక్కి పడ్డ చైనా

|

Jan 29, 2021 | 5:38 AM

WHO Team Tour: కరోనా మహమ్మారి విషయంలో చైనా మొదటి నుంచి ప్రపంచానికి సరైనా సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. వీటికి బలం చేకూర్చే సంఘటనలు కొద్ది రోజులుగా..

WHO Team Tour: ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందంతో సమావేశం అవుతాం.. వూహాన్‌ వాసుల డిమాండ్‌తో ఉలిక్కి పడ్డ చైనా
Follow us on

WHO Team Tour: కరోనా మహమ్మారి విషయంలో చైనా మొదటి నుంచి ప్రపంచానికి సరైనా సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. వీటికి బలం చేకూర్చే సంఘటనలు కొద్ది రోజులుగా చైనాలో ఎక్కువయ్యాయి. కోవిడ్‌ మూలాలపై మాట్లాడిన జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను చైనా ప్రభుత్వం అణచివేస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందంతో సమావేశం అవుతామని కోవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేయడంతో చైనా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ బృందం వూహాన్‌కు చేరుకున్నప్పటి నుంచి స్థానిక అధికారులు తమకు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.

కాగా, కరోనాపై పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం చైనాలో పర్యటిస్తోంది. గత రెండు వారాల కిందటనే చైనాకు చేరుకున్న బృందం సభ్యులు క్వారంటైన్‌ నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు ఓ హోటల్‌లో ఉండి గడువు పూర్తయిన తర్వాత పర్యటన ప్రారంభించింది. వూహాన్‌లో కరోనా మూలాలను తెలుసుకునేందుకు ఈ పర్యటన కొనసాగిస్తోంది.

Corona Vaccine: శ్రీలంకకు ఐదు లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను బహుమతిగా పంపిన భారత ప్రభుత్వం