Amazon RainForest Fire: అమెజాన్ అడవుల కార్చిచ్చు.. విద్రోహ చర్యా.?

|

Aug 26, 2019 | 2:09 PM

భూభాగానికి 20శాతం ఆక్సిజన్‌ను అందించే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ రెండు వారాలుగా తగలబడుతోంది. ఇవి ప్రకృతి సిద్ధంగా అంటుకున్నాయా.? లేక ఎవరైనా వీటిని అంటించారా.? అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. బ్రెజిల్‌ వాయువ్య ప్రాంతం నుంచి పెరు, కొలంబియా, వెనిజులా, ఈక్వెడార్, బొలీవియా, గయానా, ఫ్రాన్స్‌ వరకు లక్షలాది కిలోమీటర్ల వరకు అమెజాన్‌ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక ఎప్పటిలాగా ఈసారి కూడా బ్రెజిల్‌ పరిధిలోని అమెజాన్‌ అడవులే అంటుకున్నాయి. ఇక వాటిని ఉద్దేశపూర్వకంగానే అంటించారని అక్కడ […]

Amazon RainForest Fire: అమెజాన్ అడవుల కార్చిచ్చు.. విద్రోహ చర్యా.?
Follow us on

భూభాగానికి 20శాతం ఆక్సిజన్‌ను అందించే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ రెండు వారాలుగా తగలబడుతోంది. ఇవి ప్రకృతి సిద్ధంగా అంటుకున్నాయా.? లేక ఎవరైనా వీటిని అంటించారా.? అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. బ్రెజిల్‌ వాయువ్య ప్రాంతం నుంచి పెరు, కొలంబియా, వెనిజులా, ఈక్వెడార్, బొలీవియా, గయానా, ఫ్రాన్స్‌ వరకు లక్షలాది కిలోమీటర్ల వరకు అమెజాన్‌ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక ఎప్పటిలాగా ఈసారి కూడా బ్రెజిల్‌ పరిధిలోని అమెజాన్‌ అడవులే అంటుకున్నాయి. ఇక వాటిని ఉద్దేశపూర్వకంగానే అంటించారని అక్కడ ప్రజలు వాపోతున్నారు. అక్రమంగా కొంతమంది భూముల కోసం వీటిని తగలబెడుతున్నారని వారు అంటున్నారు.

మరోవైపు నెటిజన్లు ‘ప్రే..ఫర్‌ అమెజాన్స్‌’ అనే హాష్‌ట్యాగ్‌ను రెండు రోజులుగా వైరల్ చేస్తున్నారు. ఆగస్టు 19, 20వ తేదీల నాటికి ఓ మోస్తారుగా బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవులు అంటుకున్నాయి. ఇక సహజంగా నిప్పంటుకునే లక్షణం అమెజాన్ అడవులకు లేదు. అయితే ఆ ప్రాంతంలో ఉండే పది మున్సిపాలిటీ నగరాల్లో ఎక్కువగా అడవుల నరికివేత ఉందని తెలుస్తోంది. అక్కడ దాదాపు 43 శాతం అటవి అంతరించిపోయిందని, ఫలితంగా 375 హాట్‌బెడ్‌ ప్రాంతాలను గుర్తించామని ‘ఐపామ్‌ అమెజాన్‌ రిసర్చ్‌ సెంటర్‌’ తెలియజేసింది.