WHO Team: చైనాలో కరోనా మూలాలపై పరిశోధన.. వూహాన్‌లో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం

|

Jan 29, 2021 | 5:31 AM

WHO Team: కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాదేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యటిస్తోంది. కరోనా వైరస్‌ మూలాలను శోధించేందుకు వెళ్లిన డబ్ల్యూహెచ్‌వో దర్యాప్తు బృందం..

WHO Team: చైనాలో కరోనా మూలాలపై పరిశోధన.. వూహాన్‌లో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం
Follow us on

WHO Team: కరోనాకు పుట్టినిల్లు అయిన చైనా దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యటిస్తోంది. కరోనా వైరస్‌ మూలాలను శోధించేందుకు వెళ్లిన డబ్ల్యూహెచ్‌వో దర్యాప్తు బృందం ఎట్టకేలకు దర్యాప్తు ప్రారంభించింది. రెండు వారాల కిందట ఈ బృందం వూహాన్‌కు చేరుకోగా, క్వారంటైన్‌ నిబంధనలతో 14 రోజుల పాటు హోటల్‌కే పరిమితమైంది. తాజాగా ఆ గడువు ముగియడంతో కరోనా మూలాలపై దర్యాప్తు ప్రారంభమైంది.

కరోనా వైరస్‌ ముందు గబ్బిలాల నుంచే మానవులకు వ్యాపించినట్లు అంతర్జాతీయ నిపుణులు అనుమానిస్తున్నారు. కరోనా మూలాలపై చైనా భిన్న వాదనలు వినిపిస్తున్న చైనా.. అంతర్జాతీయ దర్యాప్తు బృందానికి సహకరించలేదు. చైనా తీరుపై అమెరికా తొలి నుంచి తీవ్ర నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తాజాగా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా కోవిడ్‌ మూలాలపై చైనా అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని పేర్కొంది. కరోనా మూలాలపై ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అమెరికా ప్రకటనపై ఆగ్రహించిన చైనా, వీటిపై దర్యాప్తు జరుపుతోన్న డబ్ల్యూహెచ్‌వో బృందం పని తీరును గౌరవించాలని తెలిపింది.

కాగా, వూహాన్‌లో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం కోవిడ్‌ మూలాల శోధనలో భాగంగా సెమినార్లు, క్షేత్ర పర్యటనలు చేయనున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే కరోనా వైరస్‌ ముందు వ్యాపించినట్లు భావిస్తున్న వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ను ఈ బృందం పర్యటిస్తుందా..? లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ఇదే ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ అయినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు పదేపదే ఆరోపించిన విషయం తెలిసిందే.

Security Council: ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్ శాశ్వ‌త స‌భ్య‌త్వంపై…. అమెరికా రాయ‌బారి ఏమ‌న్నారంటే..?