COVID VACCINE: కరోనా వ్యాక్సిన్ విషయంలో డబ్లూహెచ్‌వో సంచలన నిర్ణయం.. వారికి ప్రాధాన్యత అవసరం లేదని ప్రకటన..

|

Jan 27, 2021 | 12:08 AM

COVID VACCINE: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌లకు కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ బృందం సంచలన నిర్ణయం తీసుకుంది.

COVID VACCINE: కరోనా వ్యాక్సిన్ విషయంలో డబ్లూహెచ్‌వో సంచలన నిర్ణయం.. వారికి ప్రాధాన్యత అవసరం లేదని ప్రకటన..
Follow us on

COVID VACCINE: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌లకు కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ బృందం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని స్పష్టం చేసింది. తొలుత ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలతో పాటు ప్రతి దేశంలో 20శాతం మందికి వ్యాక్సిన్‌ అందించాలని పిలుపునిచ్చింది.

అంతర్జాతీయ ప్రయాణికులకు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల అసమానతలకు కారణమవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయపడింది. అంతేకాకుండా, వ్యాక్సిన్‌ వాడటం వల్ల వెంటనే కరోనా వ్యాప్తి తగ్గుతుందనడానికి ఎటువంటి రుజువులు లేకపోవడంతో ప్రస్తుతం ప్రయాణికులకు వ్యాక్సిన్‌ను సిఫార్సు చేయడం లేదని నిపుణుల బృందం(SAGE) వెల్లడించింది. అయితే, ముప్పు పొంచి వున్న ప్రయాణికులకు మాత్రం వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని సూచించింది.

సమయానికి రైలు ఎక్కలేకపోయారా.. అయితే మీ టికెట్ సొమ్ము వాపస్.. అయితే ఈ అవకాశం ఎక్కడో తెలుసా..