కరోనా కలకలం.. వారంతా ఎక్కడకు వెళ్లారు..!

| Edited By:

Feb 09, 2020 | 8:59 PM

కరోనా మహమ్మారి డ్రాగన్ కంట్రీ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి.. మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 800 దాటేసింది.. మరో 37వేల మందికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న దేశం కావడంతో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో చైనా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశం సరిహద్దులను మూసేయడంతో పాటు రాకపోకలపై ఆంక్షలు విధించారు. అయితే కరోనా ప్రభావం చైనాలోని వుహాన్ ప్రదేశంలో ఎక్కువగా ఉండగా.. […]

కరోనా కలకలం.. వారంతా ఎక్కడకు వెళ్లారు..!
Follow us on

కరోనా మహమ్మారి డ్రాగన్ కంట్రీ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి.. మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 800 దాటేసింది.. మరో 37వేల మందికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న దేశం కావడంతో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో చైనా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశం సరిహద్దులను మూసేయడంతో పాటు రాకపోకలపై ఆంక్షలు విధించారు. అయితే కరోనా ప్రభావం చైనాలోని వుహాన్ ప్రదేశంలో ఎక్కువగా ఉండగా.. ఈ వైరస్ విస్తరిస్తోన్న క్రమంలోనే ఈ ప్రాంతం నుంచి దాదాపు 5 మిలియన్ల మంది జనం బయటికి వెళ్లినట్లు ఓ రిపోర్టులో తేలింది. దీంతో వారంతా ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు బైడూ అనే మ్యాపింగ్‌ సంస్థ నడుం కట్టింది.

లొకేషన్‌ ఆధారంగా జనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే వివరాలు వారు తెలుసుకుంటున్నరు. వెళ్లిన వారిలో 14 శాతం చుట్టుపక్కల ఉన్న హెనాన్‌, హునాన్‌, అన్హుయి, జియాంగ్సి ప్రాంతాలకు వెళ్లారని బైడూ ప్రకటించింది. మరికొంత మంది తమ లొకేషన్‌ వివరాలు సరిగా వెల్లడించకపోవడంతో కొంత సమస్య ఏర్పడింది. కాగా చాలా ఏళ్లుగా చైనాలో వ్యాధుల వ్యాప్తిని గుర్తించేందుకు ఈ మ్యాపింగ్‌ వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కరోనా వ్యాప్తిపై హాంకాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్పందించారు. చైనా ఇప్పుడు పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోంది. సెంట్రల్ చైనాతో పాటు వుహాన్ నుంచి చాలామంది బయటకు వెళ్లారు. వాళ్లందరినీ గుర్తిస్తేనే సమస్య ఓ కొలిక్కి వస్తుంది అని అంటున్నారు.