కలకలం రేపుతున్న కొత్తవైరస్.. యూఎస్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4 లక్షల కరోనా కేసులు

|

Dec 22, 2020 | 6:02 PM

కొత్త కరోనా కలకలం రేపుతోంది. కరోనా వైరస్ వేరియెంట్‌గా గుర్తింపబడ్డ ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.

కలకలం రేపుతున్న కొత్తవైరస్.. యూఎస్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4 లక్షల కరోనా కేసులు
Follow us on

కొత్త కరోనా కలకలం రేపుతోంది. కరోనా వైరస్ వేరియెంట్‌గా గుర్తింపబడ్డ ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. బ్రిటన్‌లో ఈ కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చేసందుతుంది. ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై అన్ని దేశాలు నిషేధం విధించాయి. కాగా యూఎస్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు.

ఒక్క రోజులోనే రష్యాలో 28 వేలకేసులు నమోదు అయ్యాయి.  బ్రెజిల్ లో 70 వేల కేసులు నమోదయ్యాయి. జర్మనీలో 33 వేల కేసులు, యూకేలో 36 వేలు కేసులు నమోదు అయ్యాయి. దాంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో  భారత్ కోవిడ్ కేసులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.