చమురు నౌకల్లో భారీ పేలుళ్లు.. ఇరాన్ పనేనన్న అమెరికా

| Edited By:

Jun 14, 2019 | 9:04 AM

అమెరికా-ఇరాన్‌ మధ్య సాగుతున్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. గురువారం గల్ఫ్‌‌ ఆఫ్ ఒమన్‌లో రెండు చమురు ట్యాంకర్లలో భారీ పేలుళ్లు సంభవించాయి. కోకుకా కార్గోస్‌కు చెందిన నౌక, ఫ్రంట్ ఆల్టర్ కు చెందిన నౌకలు ప్రమాదాలకు గురైయ్యాయి. అయితే దీని వెనుక ఇరాన్ కుట్ర ఉందని అమెరికా ఆరోపించింది. మైన్స్‌తో ఆయిల్ ట్యాంకర్లను పేల్చివేయడం ఇరాన్‌కు అలవాటేనని అమెరికా అమెరికా రక్షణశాఖ తెలిపింది. ఇలాంటి కుట్రలతో చమురు రవాణా నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందన్న అనుమానాలను అమెరికా […]

చమురు నౌకల్లో భారీ పేలుళ్లు.. ఇరాన్ పనేనన్న అమెరికా
Follow us on

అమెరికా-ఇరాన్‌ మధ్య సాగుతున్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. గురువారం గల్ఫ్‌‌ ఆఫ్ ఒమన్‌లో రెండు చమురు ట్యాంకర్లలో భారీ పేలుళ్లు సంభవించాయి. కోకుకా కార్గోస్‌కు చెందిన నౌక, ఫ్రంట్ ఆల్టర్ కు చెందిన నౌకలు ప్రమాదాలకు గురైయ్యాయి. అయితే దీని వెనుక ఇరాన్ కుట్ర ఉందని అమెరికా ఆరోపించింది. మైన్స్‌తో ఆయిల్ ట్యాంకర్లను పేల్చివేయడం ఇరాన్‌కు అలవాటేనని అమెరికా అమెరికా రక్షణశాఖ తెలిపింది. ఇలాంటి కుట్రలతో చమురు రవాణా నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందన్న అనుమానాలను అమెరికా వ్యక్తం చేసింది. మంటలను అదుపు చేయడానికి యుద్ధ నౌకలను అక్కడికి పంపించింది.

అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణల్లో నిజం లేదని.. ఆయిల్ ట్యాంకర్ల‌లో సిబ్బందిని తామే కాపాడినట్లు తెలిపింది. సిబ్బంది క్షేమంగా ఉన్న దృశ్యాలను ఇరాన్ విడుదల చేసింది. ఈ ఘటనతో అమెరికా – ఇరాన్‌ల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.