Russia – Ukraine War: అత్త మీద కోపం దుత్తమీద చూపడం అంటే ఇదే.. పాపం పుతిన్ ప్రేయసి.. మ్యాటర్ ఏంటంటే..!

|

May 08, 2022 | 5:57 AM

Russia - Ukraine War: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అనే నానుడి తెలుగునాట ఎంతో ఫేమస్ అనే సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి..

Russia - Ukraine War: అత్త మీద కోపం దుత్తమీద చూపడం అంటే ఇదే.. పాపం పుతిన్ ప్రేయసి.. మ్యాటర్ ఏంటంటే..!
Putin Girlfriend
Follow us on

Russia – Ukraine War: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అనే నానుడి తెలుగునాట ఎంతో ఫేమస్ అనే సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రేయసి. అవును.. యుద్ధం ఆయన నిర్ణయం అయితే, ఎఫెక్ట్ మాత్రం ఆయన ప్రేయసిపై పడుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాను నిలువరించేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో పాటు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా రష్యాపై కఠినమైన ఆంక్షలను కూడా విధిస్తున్నాయి. తాజాగా ఈయూ ఆరో ఆంక్షల ప్యాకేజీని ప్రతిపాదించింది. తాజా ఆంక్షల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రియురాలు అలీనా కబయేవా పేరు కూడా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె విదేశీ ప్రయాణాలు, కార్యక్రమాలపై కూడా నిషేధం విధించాలని భావిస్తున్నట్లు సమాచారం వస్తోంది.

38ఏళ్ల అలీనా జిమ్నాస్ట్, మోడల్, గాయని, రాజకీయ నాయకురాలు కూడా. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్‌లో ఆమె స్వర్ణ పతకాన్ని సాధించారు. అంతేకాదు తన కెరీర్‌లో 14 ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలు, 21 యూరోపియన్ ఛాంపియన్ షిప్ పతకాలను కైవసం చేసుకున్నారు. పుతిన్‌కు, ఈమెకు ముగ్గురు పిల్లలు పుట్టినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌లోని ఓ విలాసవంతమైన విల్లాలో ఉంటున్నట్టు సమాచారం. ఈ విల్లాకు అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది.