జీ-7 సమ్మిట్ కి హాజరు కావాలని ప్రధాని మోదీకి బ్రిటన్ పిలుపు, బోరిస్ జాన్సన్ ఇండియాను సందర్శించే సూచన

| Edited By: Pardhasaradhi Peri

Jan 17, 2021 | 12:53 PM

వచ్ఛే జూన్ నెలలో తమ దేశంలో జరిగే జీ-7 సమ్మిట్ కి హాజరు కావాలని ప్రధాని మోదీని బ్రిటన్ ఆహ్వానించింది. అయితే ఆ సమ్మిట్ కి ముందు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్..

జీ-7 సమ్మిట్ కి హాజరు కావాలని ప్రధాని మోదీకి బ్రిటన్ పిలుపు, బోరిస్ జాన్సన్ ఇండియాను సందర్శించే సూచన
Boris Johnson
Follow us on

వచ్ఛే జూన్ నెలలో తమ దేశంలో జరిగే జీ-7 సమ్మిట్ కి హాజరు కావాలని ప్రధాని మోదీని బ్రిటన్ ఆహ్వానించింది. అయితే ఆ సమ్మిట్ కి ముందు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాను విజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 26 న గణ తంత్ర దినోత్సవాలకు బోరిస్ జాన్సన్ ముఖ్యఅతిథిగా ఇండియాను సందర్శించాల్సి ఉంది. అయితే తమ దేశంలో తలెత్తిన మ్యుటెంట్ కరోనా వైరస్ దృష్ట్యా ఆయన తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూరోపియన్ యూనియన్ జీ-7 లో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇండియాతో బాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలను గెస్టులుగా  ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినట్టు యూకే ఓ ప్రకటనలో తెలిపింది.  ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ పరిస్థితి, క్లైమేట్ ఛేంజ్ తదితర అంశాలపై ఈ సభ్యదేశాలు చర్చించనున్నాయని ఈ ప్రకటనలో వెల్లడించారు. కరోనా వైరస్ పై పోరులో భారత, బ్రిటన్ దేశాలు సహకరించుకుంటున్నాయని, ఇతర రంగాల్లో కూడా సహకారాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేస్తున్నాయని ఇందులో పేర్కొన్నారు. జీ-7 సమ్మిట్ కు ముందే బోరిస్ జాన్సన్ ఇండియాను సందర్శించగోరుతున్నారని ఈ ప్రకటన స్పష్టం చేసింది.

ఇక బ్రిటన్ లో కరోనా వైరస్ ఇంకా ప్రబలంగా ఉంది. పీఎం బోరిస్ జాన్సన్ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలను ప్రజలు, ముఖ్యంగా యువత నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంగ్లండ్ తదితర నగరాల్లో విధించిన లాక్ డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. బ్రిటన్ నుంచి ఇండియాకు చేరుతున్న వారి కారణంగా ఇండియాలో మ్యుటెంట్ కరోనా వైరస్ కేసులు 108 కి పెరిగాయి.

Also Read:

విశాఖ వాసులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ రైళ్ల వేళల్లో మార్పులు.. పూర్తి వివరాలివే.!

కోవిడ్ మూలాలపై చైనా చేరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు, వూహన్ ల్యాబ్ పై ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసిన అమెరికా

Bike Thieves’ Gang Busted: యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనం చేస్తున్న ముఠా అరెస్ట్, బంగారు ఆభరణాలు, 23 బైకులు స్వాధీనం