కోవిడ్ మూలాలపై చైనా చేరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు, వూహన్ ల్యాబ్ పై ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసిన అమెరికా

కోవిడ్ మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 13 మంది నిపుణుల బృందం ఓ వైపు చైనాకు చేరుకోగా, మరోవైపు చైనాలోని

కోవిడ్ మూలాలపై చైనా చేరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు, వూహన్ ల్యాబ్ పై ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసిన అమెరికా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 17, 2021 | 12:20 PM

కోవిడ్ మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 13 మంది నిపుణుల బృందం ఓ వైపు చైనాకు చేరుకోగా, మరోవైపు చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ తప్పించుకుని పోయి ఉండవచ్చునంటూ అమెరికా ఓ ఫ్యాక్ట్ షీట్ ను విడుదల చేసింది. 2019 లో ఈ ల్యాబ్ లో పలువురు అస్వస్థులయ్యారని, ఇందుకు తమవద్ద ఆధారాలు ఉన్నాయని అమెరికా ఈ షీట్ లో పేర్కొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణులతో చైనీస్ శాస్త్రజ్ఞులు చర్చలు జరపాలని, వారికి కరోనా వైరస్ కి సంబంధించిన అన్ని విషయాలను తెలియజేయాలని ఇందులో సూచించింది. అటు-ప్రస్తుతం ఈ నిపుణులంతా క్వారంటైన్ లో ఉన్నారు. వీరిని  చైనా ప్రభుత్వం 14 రోజుల  క్వారంటైన్ కి పంపింది. కోవిడ్ ప్రొటొకాల్స్ ని తప్పనిసరిగా పాటిస్తున్నామని, కొత్తగా 138 కి పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు.

ఇలా ఉండగా వూహన్ ల్యాబ్   కరోనా వైరస్ కి సంబంధించి కావాలనే ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టిస్తోందని అమెరికా తన ఫ్యాక్ట్ షీట్ లో ఆరోపించింది. ఈ ల్యాబ్ నుంచి ఓ రీసెర్చర్ హాంకాంగ్ కి పారిపోయి ల్యాబ్ లో జరుగుతున్న పరిశోధనల గురించి మీడియాకు తెలియజేసిందని, అప్పుడే దీని బండారం బయటపడిందని ఇందులో వివరించింది. తనకు ప్రాణహాని ఉందని ఆ రీసెర్చర్ ఆ నాడే ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించింది.

Also Read:

రెగ్యులర్ రైళ్లు తిరిగి ప్రారంభమయ్యేది అప్పుడేనా.? మార్చి నెలాఖరు దాకా ప్రత్యేక ట్రైన్స్ పొడిగింపు.!!

రైతుల ఆందోళన, పంజాబీ నటుడితో సహా 40 మందికి జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు, అకాలీదళ్ మండిపాటు

ఆమె చేసిన రేప్ ఆరోపణల నుంచి నన్ను తప్పించండి, అప్పీల్స్ కోర్టుకు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన, వైట్ హౌస్ వీడే వేళ