3 నిమిషాల జూమ్‌ కాల్‌లో.. 3,700 మంది ఉద్యోగులపై వేటు..!

| Edited By:

May 14, 2020 | 8:47 PM

కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడానికి చాలా కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.

3 నిమిషాల జూమ్‌ కాల్‌లో.. 3,700 మంది ఉద్యోగులపై వేటు..!
Follow us on

కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడానికి చాలా కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా ప్రముఖ క్యాబ్‌ సర్వీస్ సంస్థ ఉబర్‌ అమెరికాలో దాదాపుగా 3,700 మంది ఉద్యోగులను తీసేసింది. మూడు నిమిషాల నిడివి కూడా లేని జూమ్‌ కాల్‌ ద్వారా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం ఇచ్చింది. ఉబర్‌లో ఇదే మీకు చివరి పనిదినం అంటూ వారిని తొలగించింది.

ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన ఓ వీడియో బయటికి రాగా అందులో కంపెనీ మేనేజర్ మాట్లాడుతూ.. ఇదే మీకు ఉబర్‌లో చివరి పనిరోజు. కరోనా కారణంగా కంపెనీ కార్యకలాపాలు సగానికి సగం పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఫ్రంట్‌ లైన్‌ ఉద్యోగులకు పనిలేదు అని ఉంది. కాగా కరోనా క్లిష్ట పరిస్థితుల్లో 14శాతం మంది పూర్తి స్థాయి ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ గతవారమే ప్రకటించిన విషయం తెలిసిందే.

Read This Story Also: తెలంగాణలో బస్సులు నడిపేది అప్పుడే.. మంత్రి క్లారిటీ..!