పాక్‌ గగనతలంలో చక్కర్లు కొట్టిన టర్కీ యుద్ధ విమానాలు.. ఏం జరుగుతోంది?

టర్కీకి చెందిన భారీ రవాణా యుద్ధ విమానాలు వరుసగా పాకిస్తాన్‌కు వస్తూ, ఆ పై తిరిగి వెళ్తుండటం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్ట్‌ 19 నుంచి 21 వరకు, టర్కీ విమానాలు నాన్‌స్టాప్‌గా ప్రయాణాలు సాగించిన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి.

పాక్‌ గగనతలంలో చక్కర్లు కొట్టిన టర్కీ యుద్ధ విమానాలు.. ఏం జరుగుతోంది?
Ethel 117 Years Britain Woman (1)

Updated on: Aug 23, 2026 | 9:07 PM

టర్కీకి చెందిన భారీ రవాణా యుద్ధ విమానాలు వరుసగా పాకిస్తాన్‌కు వస్తూ, ఆ పై తిరిగి వెళ్తుండటం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్ట్‌ 19 నుంచి 21 వరకు, టర్కీ విమానాలు నాన్‌స్టాప్‌గా ప్రయాణాలు సాగించిన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. టర్కీకి చెందిన సీ-130 హెర్క్యులెస్ రవాణా విమానాలు రావల్పిండిలోని ‘నుర్ ఖాన్’ ఎయిర్‌బేస్‌, కరాచీలోని ‘మస్రూర్’ ఎయిర్‌బేస్‌ల మధ్య వరుసగా రాకపోకలు సాగించాయి.

రహస్య రవాణా వెనుక అసలు కథ!

ఈ అనుమానాస్పద ప్రయాణాలపై ఇరు దేశాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, రక్షణ రంగానికి చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ తన వైమానిక, రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు టర్కీ నుంచి భారీగా ఆయుధ సామగ్రిని దిగుమతి చేసుకుంది. ముఖ్యంగా టర్కీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యంత ప్రమాదకర ‘బేరాక్టర్ టీబీ2’ డ్రోన్లు, ఇతర క్షిపణి రక్షణ వ్యవస్థలను,  టర్కీ ఈ విమానాల ద్వారా పాకిస్తాన్‌కు చేరవేసింది. ఈ ‘బేరాక్టర్ టీబీ2’ డ్రోన్లు మధ్యస్థ శ్రేణికి చెందినవి. గతంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యా  క్షిపణి వ్యవస్థలపై దాడులు చేయడానికి ఉక్రెయిన్ బలగాలు ఈ డ్రోన్లనే విస్తృతంగా వాడాయి.

‘ఇస్లామిక్ నాటో’ వ్యూహంలో భాగమేనా?

ఇటీవల టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య కీలక త్రైపాక్షిక సైనిక ఒప్పందం కుదిరింది. దీనిని రక్షణ రంగ నిపుణులు ‘ఇస్లామిక్ నాటో’గా అభివర్ణిస్తున్నారు. యుద్ధ సమయాల్లో లేదా రక్షణ పరమైన అవసరాలు ఏర్పడినప్పుడు ఈ దేశాలు పరస్పరం సైనిక సాయం అందించుకోవాలనేది ఈ ఒప్పంద సారాంశం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ నేరుగా ఈ ఆయుధ దిగుమతుల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్  రహస్యంగా టర్కీ నుంచి డ్రోన్లు, రక్షణ వ్యవస్థలను సమకూర్చుకోవడం దక్షిణాసియా ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుందోనని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us