Tunisian President: ఆ దేశ అధ్యక్షుడిని హత్య చేయడానికి విషపు ఉత్తరాన్ని పంపిన గుర్తు తెలియని వ్యక్తులు.. సహాయకురాలికి అస్వస్థత

|

Jan 29, 2021 | 1:06 PM

సినిమాల్లో రాజులను హతమార్చడానికి గుర్తు తెలియని వ్యక్తితో విషపు ఉత్తరం పంపించడం.. అయితే తాజాగా ఓ దేశ అధ్యక్షుడిని హత్య చేయడానికి విషపు లేఖను పంపించారు.. ఆ ఉత్తరం తెరచిన అధ్యక్షుడి సహాయకురాలు అనారోగ్యానికి గురైంది...

Tunisian President: ఆ దేశ అధ్యక్షుడిని హత్య చేయడానికి విషపు ఉత్తరాన్ని పంపిన గుర్తు తెలియని వ్యక్తులు.. సహాయకురాలికి అస్వస్థత
Follow us on

Tunisian President: సినిమాల్లో రాజులను హతమార్చడానికి గుర్తు తెలియని వ్యక్తితో విషపు ఉత్తరం పంపించడం.. అయితే తాజాగా ఓ దేశ అధ్యక్షుడిని హత్య చేయడానికి విషపు లేఖను పంపించారు.. ఆ ఉత్తరం తెరచిన అధ్యక్షుడి సహాయకురాలు అనారోగ్యానికి గురైంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆర్మ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ట్యూనిషియా దేశంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…

ట్యూనిషియా అధ్యక్షుడు కైస్‌ సయీద్‌కు సోమవారం ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ను అప్పటినుంచి కిస్ తెరచిచూడలేదు.. అయితే ఈరోజు ఆయన సహాయకురాలు నదియా అకాచ అధ్యక్షుడి టేబుల్‌పై పెట్టి ఆ లేఖను తెరచి చూసింది. అందులో ఖాళీ పేపర్‌ ఉండడంతో అనుమానంరాగా .. అందునుంచి ఓ రకమైన వాసన వచ్చింది. అనంతరం సహాయకురాలు నదియా కి తీవ్ర అస్వస్థత చేసింది. కళ్ళు నుంచి నీరుకారడం.. తలనొప్పి రావడం మొదలైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బందికి ఆమెను సమీప మిలటరీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె పరిస్థితి కొంచెంమెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటన ట్యూనిషియాలో కలకలం రేపింది. దేశ అధ్యక్షుడిని లక్ష్యంగా ఆ లేఖ పంపారని.. అధ్యక్షుడి చంపేందుకు కుట్ర పన్నారని గుర్తించారు. దీంతో ఆ దేశ అధికారులు అప్రమత్తమై వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విషయంపై వెంటనే అధ్యక్షుడు కిస్ సయీద్ స్పందిస్తూ… ఓ ప్రకటన విడుదల చేశారు.. తనకు ఆ లేఖతో ఏమి కాలేదని.. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు.

Also Read: కరోనా నిబంధనలను పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి కోవింద్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు