China Gold Mine Blast : చైనా గనిలో వర్కర్ల వెలికితీతపై కొనసాగుతున్న ప్రయత్నాలు.. మరో 15 రోజులు పట్టవచ్చని అంచనా

|

Jan 22, 2021 | 11:05 AM

చైనాలోని బంగారు గనిలో పేలుడు జరిగి దాదాపు 11 రోజులైనా అందులో చిక్కుకున్న కార్మికులను ఇంకా వెలికి తీయలేదు. ఆ గనిలో చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు..

China Gold Mine Blast : చైనా గనిలో వర్కర్ల వెలికితీతపై కొనసాగుతున్న ప్రయత్నాలు.. మరో 15 రోజులు పట్టవచ్చని అంచనా
Follow us on

China Gold Mine Blast :చైనాలోని బంగారు గనిలో పేలుడు జరిగి దాదాపు 11 రోజులైనా అందులో చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ గనిలో చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు మరో 15 రోజులు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. జనవరి 11న తూర్పు షాండోంగ్ ప్రావిన్స్‌లో ఉన్న జిచెంగ్ టౌన్‌షిప్‌లో బంగారు గనిలో భారీ పేలుడుజరిగింది. ఈ పేలుడుతో గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మన్ను పేరుకుపోయింది. దీంతో ఈ మట్టిని తవ్వుకుంటూ పోతే తప్ప గనిలో వారిని బయటకు తీసే అవకాశం లేదని రెస్కూ టీమ్ అధికారి తెలిపారు. ఇప్పటికే పేలుడు సమయంలో గాయాలతో ఒక వర్కర్‌ మరణించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి.

దీంతో గనిలో ఇంకా 21 మంది చిక్కుకుని ఉన్నారు. వీరిలో 11 మందితో సంబంధాలు పునరుద్ధరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంకో పదిమంది ఆచూకి తెలియరాలేదు. ఆ 11మందికి ఇతర మార్గాల ద్వారా ఆహారం, మెడిసిన్స్‌ అందిస్తున్నామని, మరోవైపు తవ్వకం చురుగ్గా సాగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఈ గని కి షాన్డాంగ్ వుకైలాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ కో లిమిటెడ్ కు చెందింది. .. ఈ సంస్థ చైనాలో బంగారు గనులు కలిగిన నాల్గవ అతిపెద్ద సంస్థ. గనిలో పేలుడుకు కారణాలు ఇంకా తెలియాల్సిఉంది. చైనాలో మైనింగ్‌ పరిశ్రమలో ఏటా దాదాపు 5వేల మంది మరణిస్తుంటారు.

Also Read: పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదంటూ సుప్రీంలో తన వాదన వినిపించనున్న ఏపీ సర్కర్