కరోనాకు కట్టడి.. మంచి ఫలితాలు ఇస్తోన్న ఆ మూడు వ్యాక్సిన్లు

| Edited By:

Jul 21, 2020 | 7:16 PM

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేయాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి. అందుకే పలు దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్‌ని కనుగొనే పనిలో నిమగ్నమయ్యాయి.

కరోనాకు కట్టడి.. మంచి ఫలితాలు ఇస్తోన్న ఆ మూడు వ్యాక్సిన్లు
Follow us on

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేయాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి. అందుకే పలు దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్‌ని కనుగొనే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు జంతువులపై ట్రయల్స్‌ని విజయవంతంగా పూర్తి చేసుకొని మనుషులపై ప్రయోగిస్తున్నాయి. అయితే ఈ రేసులో ముందు వరుసలో మూడు వ్యాక్సిన్‌ ఉన్నాయట. ఈ విషయాన్ని బ్రిటీష్ మెడికల్ జర్నల్‌ ప్రచురించింది.

అందులో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, బ్రిటీష్‌-స్వీడీస్‌ డ్రగ్‌ మేకర్ సంయుక్తంగా తయారు చేసిన ఆస్ట్రాజెనెకా, చైనీస్‌ కంపెనీ కాన్సినో బయోలాజిక్స్‌, ఫైజర్‌- బయోఎన్‌టెక్‌ రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ల క్లినికల్‌ పరీక్షలు విజయవంతమవుతున్నాయని తెలిపింది. ఈ వ్యాక్సిన్లు ప్రయోగాలలో రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు డేటా పేర్కొంది. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా ఇమ్యూనిటీని పెంచుతున్నట్లు తేలింది. అయితే వీటితో కాస్త సైడ్ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాక్సిన్‌ వినియోగంలో ఇతర సమస్యలు పెద్దగా తలెత్తక పోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.