సందడిగా సాగిన వైన్ ఫెస్టివల్..

| Edited By:

Jun 29, 2019 | 9:31 PM

స్పెయిన్‌లో వైన్ బాటిల్ ఫెస్టివల్ సందడిగా సాగింది. స్పెయిన్‌లోని రియోజా రీజియన్‌లో జరిగిన ఈ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది. స్థానికులతో పాటు స్పెయిన్‌లోని పలు ప్రాంతాల వాసులు ఉత్సాహంగా పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు బాటిళ్ల కొద్ది వైన్ చల్లుకుంటూ తెగ ఎంజాయ్ చేశారు. ఆ ప్రాంతమంతా వైన్‌తో నిండిపోయింది. ఈ ఫెస్టివల్‌కు వచ్చిన వేలాది మంది వైన్‌తో తడిసిముద్దయ్యారు. ప్రతిఏటా బాటిల్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు. ఇందుకోసం డెబ్బై వేల లీటర్ల వైన్‌ను ఉపయోగిస్తారు. ఫెస్టివల్‌లో పాల్గొనే […]

సందడిగా సాగిన వైన్ ఫెస్టివల్..
Follow us on

స్పెయిన్‌లో వైన్ బాటిల్ ఫెస్టివల్ సందడిగా సాగింది. స్పెయిన్‌లోని రియోజా రీజియన్‌లో జరిగిన ఈ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది. స్థానికులతో పాటు స్పెయిన్‌లోని పలు ప్రాంతాల వాసులు ఉత్సాహంగా పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు బాటిళ్ల కొద్ది వైన్ చల్లుకుంటూ తెగ ఎంజాయ్ చేశారు. ఆ ప్రాంతమంతా వైన్‌తో నిండిపోయింది. ఈ ఫెస్టివల్‌కు వచ్చిన వేలాది మంది వైన్‌తో తడిసిముద్దయ్యారు. ప్రతిఏటా బాటిల్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు. ఇందుకోసం డెబ్బై వేల లీటర్ల వైన్‌ను ఉపయోగిస్తారు. ఫెస్టివల్‌లో పాల్గొనే వారు తప్పనిసరిగా తెల్లగా దుస్తులు ధరించాల్సి ఉంటుంది.