భారతీయుడే నా వారసుడు: దలైలామా

| Edited By:

Mar 20, 2019 | 3:46 PM

తన తదుపరి వారసుడిని(అవతారాన్ని) భారత్‌లోనే కనుగొనవచ్చని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. చైనా ఎంపిక చేసే వారసుడికి గౌరవం దక్కదని ఆయన స్పష్టం చేశారు. ‘‘నా మరణానంతరం నా వారసుడిగా చైనా ఓ వ్యక్తిని ఎంపిక చేయవచ్చు. దలైలామా పునర్జన్మకు చైనా చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది. వారికి నాకన్నా తదుపరి దలైలామా గురించే చింత ఎక్కువ. భవిష్యత్‌లో ఇద్దరు దలైలామాలు రావొచ్చు. ఒకరు భారత్‌ నుంచి వస్తారు. మరొకరిని చైనా ఎంపిక చేస్తుంది. కానీ చైనా […]

భారతీయుడే నా వారసుడు: దలైలామా
Follow us on

తన తదుపరి వారసుడిని(అవతారాన్ని) భారత్‌లోనే కనుగొనవచ్చని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. చైనా ఎంపిక చేసే వారసుడికి గౌరవం దక్కదని ఆయన స్పష్టం చేశారు. ‘‘నా మరణానంతరం నా వారసుడిగా చైనా ఓ వ్యక్తిని ఎంపిక చేయవచ్చు. దలైలామా పునర్జన్మకు చైనా చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది. వారికి నాకన్నా తదుపరి దలైలామా గురించే చింత ఎక్కువ. భవిష్యత్‌లో ఇద్దరు దలైలామాలు రావొచ్చు. ఒకరు భారత్‌ నుంచి వస్తారు. మరొకరిని చైనా ఎంపిక చేస్తుంది. కానీ చైనా ఎంపిక చేసిన వ్యక్తిని ఎవరూ గౌరవించరు’’ అంటూ దలైలామా పేర్కొన్నారు.

అయితే 1950లో టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత 1959లో చైనా పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు విఫలం అయ్యింది. ఆ సమయంలోనే దలైలామా సైనికుని వేషంలో తప్పించుకొని భారత్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి టిబెట్‌కు భాషాపరమైన, సంస్కృతిపరమైన స్వయంప్రతిపత్తిని సాధించేందుకు ఆయన ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనా దలైలామాను వేర్పాటువాదిగా పరిగణిస్తోన్న విషయం తెలిసిందే.