Indo China border news: భారత్-చైనాల మధ్య మరో దఫా శాంతి చర్చలు.. ఈసారైనా ఫలితం ఉండేనా?

|

Apr 09, 2021 | 12:20 PM

భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ పలు దఫాలుగా చర్చలు కొనసాగించిన ఇరు దేశాల సైన్యాధికారులు మరోమారు చర్చలకు సిద్ధం అయ్యారు.

Indo China border news: భారత్-చైనాల మధ్య మరో దఫా శాంతి చర్చలు.. ఈసారైనా ఫలితం ఉండేనా?
భారత - చైనా సరిహద్దు సమస్యను 'సరైన స్థానం'లో ఉంచాలని భారత్ కు చైనా సూచన
Follow us on

భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ పలు దఫాలుగా చర్చలు కొనసాగించిన ఇరు దేశాల సైన్యాధికారులు మరోమారు చర్చలకు సిద్ధం అయ్యారు. ఈరోజు తూర్పు లడ్డాఖ్ ఛుషుల్ ప్రాంతంలో మరో మారు చర్చలు జరగనున్నాయి. ఇరు కొర్ కమాండర్ల మధ్య 11వ సారి ఈ సమావేశం ఏర్పాటు అవుతోంది. ఇంతకు ముందు పదిసార్లూ జరిగిన చర్చలు అంత సత్ఫలితాలు ఇవ్వలేదు. అయితే, ఈసారి లడ్డాఖ్ లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకున్న తరువాత ఈ భేటీ జరగనుండడంతో ఇది చాలా కీలక సమావేశంగా భావిస్తున్నారు.

కాగా భారత్-చైనా దేశాల మధ్య గతేడాది మే నెల నుంచి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమమంలో ఎల్వోసీ వెంబడి రెండు దేశాలూ భారీగా సైన్యాన్ని మోహరించాయి. చైనాతో జరుగుతున్న చర్చల్లో ప్రధానంగా ఈ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణ అంశమే కీలకంగా ఉంది. చైనా బలగాల ఉపసంహరణ విషయంలో తరచూ మాటమారుస్తూ వస్తోంది. బలగాలను ఉపసంహరిస్తున్నట్టే చేసి..తిరిగి రెట్టింపు బలగాలను సరిహద్దుల్లో మోహరిస్తోంది. దీంతో ఈ అంశంపైనే పలు దఫాలుగా చర్చలు సాగుతూ వస్తున్నాయి. ఈ సారి కూడా లడ్డాఖ్‌లోని గోగ్రా, హాట్‌ స్ప్రింగ్స్‌, డెప్పాంగ్‌ మైదానాల నుంచి బలగాలను ఉపసంహరించుకునే అంశమే ప్రధానముగా అధికారుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరగనున్న కొర్ కమాండర్ స్థాయి అధికారుల సమావేశం కీలకంగా మారింది.

Also Read: Caroline Jurie : శ్రీలంక 2021 విన్నర్‌ పుష్పిక డిసిల్వాను స్టేజ్ పై తీవ్రంగా అవమానించిన ఘటన.. మిసెస్‌ వరల్డ్‌ కరోలిన్‌ జూరీ అరెస్ట్

viral video: థాయ్‌లాండ్ లోని ఒక సూపర్‌మార్కెట్లోకి దూసుకొచ్చిన రాకాసి బల్లి..!! వైరల్ వీడియో..