Nigeria: జైలుపై ఉగ్రవాదుల దాడులు.. సెక్యూరిటీని దారుణంగా హత్య చేసి.. జైలు గోడలను బద్దలుకొట్టి

|

Jul 07, 2022 | 6:30 AM

నైజీరియాలోని (Nigeria) జైళ్లపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. గతేడాది ఏప్రిల్ లో ఓవెరి ప‌ట్టణంలో ఉన్న జైలుపై దాడి ఘటనను మరవకముందే రాజధాని నగరంలోని అబూజలో ఉన్న జైలుపై తీవ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. మంగళవారం రాత్రి 10 గంటల...

Nigeria: జైలుపై ఉగ్రవాదుల దాడులు.. సెక్యూరిటీని దారుణంగా హత్య చేసి.. జైలు గోడలను బద్దలుకొట్టి
Nigerial Jail Attack
Follow us on

నైజీరియాలోని (Nigeria) జైళ్లపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. గతేడాది ఏప్రిల్ లో ఓవెరి ప‌ట్టణంలో ఉన్న జైలుపై దాడి ఘటనను మరవకముందే రాజధాని నగరంలోని అబూజలో ఉన్న జైలుపై తీవ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ముందస్తు ప్రణాళికతో తీవ్రవాద ముఠాలు జైలులోకి ప్రవేశించారు. కుజీ జైలుపై భారీ పేలుడు పదార్థాలతో దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు 600 మంది ఖైదీలు పరారయ్యారు. వారిలో సుమారు 300 మందిని తిరిగి పట్టుకున్నట్లు అధికారులు చెప్పారు. ఇస్లామిక్‌ మిలిటెంట్‌ వ్యతిరేక ముఠాలే ఈ దాడికి కారణమని అధికారులు భావిస్తున్నారు. జైలులోకి చొరబడ్డ తీవ్రవాదులు విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని దారుణంగా చంపేశారు. కాగా.. నైజీరియాలో బోకోహరం ముఠాలు జైళ్లపై దాడులకు పాల్పడడం ఎక్కువయ్యాయి. నైజీరియా రాజధాని నగరమైన అబూజలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

మరోవైపు ఈశాన్య నైజీరియాలో తీవ్రవాద ముఠాలు సృష్టిస్తున్న నరమేధానికి ఇప్పటివరకు 35వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
గతేడాది ఏప్రిల్ లో జరిగిన ఘటనలో జైలుపై సాయుధులు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో 1800 మందికి పైగా ఖైదీలు పారిపోయారు. మెషీన్ గ‌న్ను, రాకెట్ గ్రేనేడ్లతో స్థానిక మిలిటెంట్లు దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఓవెరి ప‌ట్టణంలో ఉన్న జైలుపై సోమ‌వారం తెల్లవారుజామున రెండు గంట‌ల‌కు సాయుధులు అటాక్ చేశారని స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కొంతమంది సాయుధులు ఓవేరీ పట్టణంలోని జైలులోకి చొరబడి అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు బాంబులతో పేల్చేశారని అధికారులు తెలిపారు.

అయితే, ఈ ఘటన తరువాత 35 మంది ఖైదీలు పారిపోవడానికి నిరాకరించి అక్కడే ఉండిపోయారు. మరో ఆరుగురు తిరిగి వెనక్కి వచ్చారు. నిషిద్ధ ‘ ఇండిజీనస్ పీపుల్ బయాఫ్రా’ (ఐపీఓబీ) సంస్థ ఈ దాడికి పాల్పడిందని పోలీసులు చెప్పారు. మరోవైపు, ఆ సంస్థ ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని  అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..