ఉగ్రవాద పంజా.. .పెరుగుతున్న మృతులు.. చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు

|

Jun 14, 2019 | 12:50 PM

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు గురవుతున్న దేశాల్లో ఇండియా ఏడో స్థానంలో ఉండడం ఆందోళనకరమైన విషయమని తాజాగా వెల్లడైంది.కాగా- పాకిస్థాన్ 5 వ స్థానంలో ఉందని, అయితే గతంతో పోలిస్తే ఇండియాలో ఈ దాడులు గత రెండేళ్లలో పెరిగాయని విజన్ ఆఫ్ హ్యుమానిటీ అనే సంస్థ తన నివేదికలో తెలిపింది. ప్రపంచ దేశాల్లో శాంతి, టెర్రరిజం వంటి అంశాలపై ఈ సంస్థ స్టడీ చేసి తన రిపోర్టును వెలువరించింది. ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి సంఖ్యను పేర్కొన్న […]

ఉగ్రవాద పంజా.. .పెరుగుతున్న మృతులు..  చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు గురవుతున్న దేశాల్లో ఇండియా ఏడో స్థానంలో ఉండడం ఆందోళనకరమైన విషయమని తాజాగా వెల్లడైంది.కాగా- పాకిస్థాన్ 5 వ స్థానంలో ఉందని, అయితే గతంతో పోలిస్తే ఇండియాలో ఈ దాడులు గత రెండేళ్లలో పెరిగాయని విజన్ ఆఫ్ హ్యుమానిటీ అనే సంస్థ తన నివేదికలో తెలిపింది. ప్రపంచ దేశాల్లో శాంతి, టెర్రరిజం వంటి అంశాలపై ఈ సంస్థ స్టడీ చేసి తన రిపోర్టును వెలువరించింది. ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి సంఖ్యను పేర్కొన్న ‘ విజన్ ఆఫ్ హ్యుమానిటీ ‘.. ముఖ్యంగా ఇండియాలో మృతుల సంఖ్య 12 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్-2018 పేరిట ఈ నివేదిక విడుదలైంది. 2017 లో భారత్ లో టెర్రరిస్టు దాడుల్లో 384 మంది మరణించారని, కనీసం ఒక ఉగ్రదాడికి 51 వేర్వేరు టెర్రరిస్టు బృందాలు కారణమని ఈ సంస్థ విశ్లేషించింది.

అలాగే ఒక్క టెర్రరిజం డెత్ కి 25 గ్రూపులు కారణమవుతున్నాయంటే వీటి నెట్ వర్క్ ఎంత బలంగా ఉందొ అర్థమవుతోందని ఈ రిపోర్టు పేర్కొంది. హైదరాబాద్ లో 2013 లో జరిగిన జంట పేలుళ్లలో 13 మంది మరణించగా.. 93 మంది గాయపడ్డారు. 2017 లో పది శాతం మరణాలకు లష్కరే తోయిబా కారణం. ఇదే బృందం 2008 లో ముంబైలో ఉగ్రదాడులకు పాల్పడింది. ఆ దాడుల్లో అనేకమంది మరణించగా.. గాయపడినవారి సంఖ్య కూడా అధికంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ లో 2017 లో వేర్వేరు టెర్రరిస్టు బృందాలు 102 మందిని పొట్టన బెట్టుకున్నాయి అని ఈ నివేదిక వివరించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్ బుల్ ముజాహిదీన్ వంటి గ్రూపులు చాలా చురుకుగా ఉన్నాయని, వీటి నెట్ వర్క్ ను అరికట్టడంలో ఆయా దేశాల ప్రభుత్వాలు విఫలం చెందాయని పేర్కొన్నారు. ఉగ్రవాద దాడులకు గురైన టాప్ టెన్ దేశాల్లో ఇరాక్, ఆఫ్గనిస్తాన్, నైజీరియా, సిరియా, పాకిస్థాన్, సోమాలియా, ఇండియా, ఎమెన్, ఈజిప్టు, ఫిలిప్పీన్స్ ఉన్నాయి. ఇరాక్, ఆఫ్రికా, ఆప్ఘనిస్థాన్, పాకిస్తాన్ వంటి దేశాల్లో తాలిబన్, అల్ షబాల్, బోకో హారమ్ వంటి టెర్రరిస్టు సంస్థల చేతిలో వేలాది అమాయకులు బలవుతున్నారని ఈ నివేదిక వివరించింది.

2001-2017 మధ్య కాలంలో ఇండియాలో 8,123 మంది మరణించారు. సీపీఐ మావోయిస్టు, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ బృందాలు రెచ్చిపోయి..ఊచకోతకు పాల్పడ్డాయి అని విజన్ ఆఫ్ హ్యుమానిటీ తెలిపింది. ఇప్పటికైనా ఆయా దేశాల ప్రభుత్వాలు మేల్కొని వీటిని ఎదుర్కొనేందుకు, ఐసిస్ లాంటి సంస్థలనుంచి వీటికి అందుతున్న నిధులు, ఆయుధాలను నిలిపివేలా చర్యలు తీసుకునేందుకు నడుం బిగిందాలని లేని పక్షంలో ఈ మారణ హోమం ఇలాగే కొనసాగుతుంటుందని ఈ సంస్థ హెచ్చరించింది. పాకిస్తాన్ లో ఉగ్రవాది మసూద్ అజహర్ నిషేధం పై ఐక్యరాజ్య సమితి ఓ తీర్మానాన్ని ఆమోదించినప్పటికీ.. ఆ దేశంలో చాప కింద నీరులా అతడి కార్యకలాపాలకు అడ్డుపడలేదని, పాక్ తన గడ్డపై ఉగ్రవాద ఛాయలు లేవని చెబుతున్నా.. టెర్రరిస్టు శిబిరాలు కొనసాగుతున్నాయని, జమ్మూ కాశ్మీర్ లో ఇంచుమించు ప్రతి రోజూ ఏదో ఒక టెర్రరిస్టు సంబంధ ఘటన జరగడం చూస్తూనే ఉన్నామని, భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు కాల్పులు నిత్యకృత్యమయ్యాయని ఈ సంస్థ గుర్తు చేసింది.