వైమానిక దాడులతో రక్తసిక్తం.. 38 మంది మృతి

| Edited By:

Jul 23, 2019 | 8:20 AM

సిరియా మరోసారి రక్తసిక్తమయ్యింది. వరుసగా వైమానిక దాడులు జరుగుతుండటంతో.. అక్కడి ప్రజలు భయం గుప్పట్లో బతుకు జీవనం సాగిస్తున్నారు. సోమవారం జరిగిన వైమానిక దాడుల్లో 38 మంది మరణించారు. ఇడ్లిబ్ ప్రావిన్సు పరిధిలోని మారెట్ అల్ నుమాన్‌లోని రద్దీ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సిరియా, రష్యా దళాలు వైమానిక దాడులు చేశాయి. అయితే ఈ దాడుల్లో 36 మంది సామాన్యులు మృతి చెందగా.. మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతిచెందారు. […]

వైమానిక దాడులతో రక్తసిక్తం.. 38 మంది మృతి
Follow us on

సిరియా మరోసారి రక్తసిక్తమయ్యింది. వరుసగా వైమానిక దాడులు జరుగుతుండటంతో.. అక్కడి ప్రజలు భయం గుప్పట్లో బతుకు జీవనం సాగిస్తున్నారు. సోమవారం జరిగిన వైమానిక దాడుల్లో 38 మంది మరణించారు. ఇడ్లిబ్ ప్రావిన్సు పరిధిలోని మారెట్ అల్ నుమాన్‌లోని రద్దీ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సిరియా, రష్యా దళాలు వైమానిక దాడులు చేశాయి. అయితే ఈ దాడుల్లో 36 మంది సామాన్యులు మృతి చెందగా.. మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతిచెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మరణించిన వారిలో ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు సిరియన్‌కు చెందిన పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల ఇప్పటికే 3,70,000 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలమంది అడ్రస్ లేకుండా పోయారు.