శ్రీలంకలో మరో మారణహోమం..? ఈసారి మారిన ఉగ్రవాదుల టార్గెట్

| Edited By:

Apr 29, 2019 | 4:54 PM

సరిగ్గా వారం గడిచింది. తమ దేశంలో జరిగిన వరుస ఉగ్రదాడుల నుంచి ఇంకా శ్రీలంక కోలుకోలేదు. ఆ దాడుల్లో గాయాలపాలైన వందలమంది ఇంకా ఆసుపత్రుల్లోనే ఉన్నారు. మరోవైపు ఈ దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ శ్రీలంకవాసులు ఇప్పటికీ బయటకు వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఉగ్రదాడుల భయం ఆ దేశాన్ని వణికిస్తోంది. ఈ సారి బౌద్ధమందిరాలు లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని ఆ దేశ ఇంటిలిజెన్స్‌కు సమాచారం అందినట్లు అధికారులు పేర్కొన్నారు. తమకు అందిన […]

శ్రీలంకలో మరో మారణహోమం..? ఈసారి మారిన ఉగ్రవాదుల టార్గెట్
Follow us on

సరిగ్గా వారం గడిచింది. తమ దేశంలో జరిగిన వరుస ఉగ్రదాడుల నుంచి ఇంకా శ్రీలంక కోలుకోలేదు. ఆ దాడుల్లో గాయాలపాలైన వందలమంది ఇంకా ఆసుపత్రుల్లోనే ఉన్నారు. మరోవైపు ఈ దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ శ్రీలంకవాసులు ఇప్పటికీ బయటకు వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఉగ్రదాడుల భయం ఆ దేశాన్ని వణికిస్తోంది. ఈ సారి బౌద్ధమందిరాలు లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని ఆ దేశ ఇంటిలిజెన్స్‌కు సమాచారం అందినట్లు అధికారులు పేర్కొన్నారు.

తమకు అందిన సమాచారం ప్రకారం బౌద్ధ మందిరాలపై మహిళా ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక ఉగ్రవాద సంస్థ నేషనల్ తవీత్ జమాత్ ఈ దాడులకు ప్రణాళిక రచిస్తోందని ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. మార్చి 29న ఓ ముస్లిం మహిళ 29వేల శ్రీలంకన్ రూపాయలతో బౌద్ధులు ధరించే తొమ్మిది వస్త్రాలు కొనుగోలు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ వస్త్రధారణతో బౌద్ధమందిరాలలోకి ప్రవేశించి పేలుళ్లకు పాల్పడే ప్రయత్నం చేయనుందని తెలుస్తోంది. కాగా ఈ హెచ్చరికల నేపథ్యంలో ఫ్రావిన్స్‌లోని కొంతమంది అనుమానితుల ఇళ్లలో సోదాలు చేయగా.. కొన్ని పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.