శ్రీలంకలో ఇంకా కొనసాగుతున్న ఎమర్జెన్సీ

| Edited By:

Jun 23, 2019 | 9:50 AM

శ్రీలంకలో ఎమర్జెన్సీని ఇప్పట్లో ఎత్తివేసే పరిస్థితులు కనిపించడంలేదు. గత ఏప్రిల్ 12న జరిగిన బాంబు దాడుల్లో 258 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో షాక్‌కు గురైన లంక ప్రభుత్వం.. దేశంలో ఎమర్జెన్సీని విధించింది. దేశ వ్యాప్తంగా అనుమానితులను పెద్ద ఎత్తున నిర్భందించింది. దేశంలో ఉగ్రవాదుల ముప్పు ఇప్పటికీ తొలగిపోలేదని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చిరస్తున్నాయి. మరోవైపు వరుస బాంబుపేలుళ్ల తర్వాత దేశవ్యాప్తంగా కొన్ని వర్గాలను టార్గెట్‌చేస్తూ.. దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని మరో నెలరోజులపాటు […]

శ్రీలంకలో ఇంకా కొనసాగుతున్న ఎమర్జెన్సీ
Follow us on

శ్రీలంకలో ఎమర్జెన్సీని ఇప్పట్లో ఎత్తివేసే పరిస్థితులు కనిపించడంలేదు. గత ఏప్రిల్ 12న జరిగిన బాంబు దాడుల్లో 258 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో షాక్‌కు గురైన లంక ప్రభుత్వం.. దేశంలో ఎమర్జెన్సీని విధించింది. దేశ వ్యాప్తంగా అనుమానితులను పెద్ద ఎత్తున నిర్భందించింది. దేశంలో ఉగ్రవాదుల ముప్పు ఇప్పటికీ తొలగిపోలేదని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చిరస్తున్నాయి. మరోవైపు వరుస బాంబుపేలుళ్ల తర్వాత దేశవ్యాప్తంగా కొన్ని వర్గాలను టార్గెట్‌చేస్తూ.. దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని మరో నెలరోజులపాటు పోడిగిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.