Corona Virus: కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. రకరకాల వేరియంట్స్ గా ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తుంది. ప్రస్తుతం యురేపియన్ దేశాలైన రష్యా, బ్రిటన్ లను కోవిడ్ వణికిస్తుంది. రష్యాలో మరింతగా బలపడి.. రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాలు కూడా రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. రష్యాలో రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణ మృదంగం మ్రోగిస్తోంది. ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు, వెయ్యికిపైగా మరణాలు నమోదవుతున్నాయి.
గత 24 గంటల్లో రష్యాలో 36,446 కేసులు నమోదవ్వగా, రికార్డ్ స్థాయిలో 1106 మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కేసులు తగ్గడం లేదు.. ప్రతిరోజూ వెయ్యికిపైగా మరణాలు సంభవిసున్నా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇలా భారీగా మరణాలు నమోదు కావడానికి ఆ దేశ ప్రజల నిర్లక్ష్యం అనాలోచిత నిర్ణయాలు వలెనే అంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కరోనా కట్టడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకూ వారంపాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే బయటకు రావొద్దని, వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని, మాస్క్ వినియోగించాలని పుతిన్ ప్రభుత్వం ప్రజలను కోరింది. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, చిన్నపిల్లలు బయటకు రావొద్దని హెచ్చరించింది. రష్యా పరిష్టితిని చూసి.. మిగతా దేశాలు కరోనా నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మిగతా దేశాలను హెచ్చరిస్తున్నారు.
Also Read: ఒక్క కాండానికి ఏకంగా 839 చెర్రీ టమాటాలు.. గిన్నిస్ బుక్లో చోటు .. ఎక్కడంటే..