పాప్ సింగర్‌పై దారుణం.. డ్రగ్స్ ఇచ్చి..బంధీగా ఉంచుకుని.. ఆపై గ్యాంగ్‌రేప్..!

| Edited By:

Feb 27, 2020 | 2:29 AM

ప్రపంచంలో ఎంతటి గుర్తింపు ఉన్నా.. వారి జీవితాల్లో కూడా చీకటి రోజులు ఉంటాయని మరోసారి తేటతెల్లమైంది. ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ డఫీ విషయంలో కూడా.. దారుణమైన చీకటి రోజులు ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన సంచలన విషయాలతో యావత్ హాలీవుడ్ పరిశ్రమ షాక్‌కు గురైంది. తన అద్భుతమైన గొంతుతో.. యువతని ఉర్రూతలూగించిన పాప్‌ సింగర్.. గ్రామీ అవార్డు విన్నర్ డఫీ తన లైఫ్‌లె జరిగిన ఓ దారుణ సంఘటనను బయటపెట్టింది. 2009లో గ్రామీ అవార్డు దక్కించుకున్న […]

పాప్ సింగర్‌పై దారుణం.. డ్రగ్స్ ఇచ్చి..బంధీగా ఉంచుకుని.. ఆపై గ్యాంగ్‌రేప్..!
Follow us on

ప్రపంచంలో ఎంతటి గుర్తింపు ఉన్నా.. వారి జీవితాల్లో కూడా చీకటి రోజులు ఉంటాయని మరోసారి తేటతెల్లమైంది. ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ డఫీ విషయంలో కూడా.. దారుణమైన చీకటి రోజులు ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన సంచలన విషయాలతో యావత్ హాలీవుడ్ పరిశ్రమ షాక్‌కు గురైంది. తన అద్భుతమైన గొంతుతో.. యువతని ఉర్రూతలూగించిన పాప్‌ సింగర్.. గ్రామీ అవార్డు విన్నర్ డఫీ తన లైఫ్‌లె జరిగిన ఓ దారుణ సంఘటనను బయటపెట్టింది.

2009లో గ్రామీ అవార్డు దక్కించుకున్న డఫీ.. అత్యాచారానికి గురైందని తెలిపింది. అంతేకాదు..గత దశాబ్దకాలంగా తన జీవితంలో ఎన్నో చీకటి రోజులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై జరిగిన ఈ దారుణ ఘటనను బయటపెట్టేందుకు ఇప్పటి వరకూ కరెక్ట్ రూట్ లభించలేదని.. ఇప్పుడిప్పుడే తన లైఫ్‌లో వెలుగులు విరజిల్లుతున్నాయని ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది.

చాలాకాలం సంగీతానికి దూరంగా ఉండటానికి గల కారణలేంటని నన్ను ఎంతో మంది ప్రశ్నించారని.. ఆ డౌట్ మీకు కూడా రావచ్చని.. నా లైఫ్‌లో ఓ చేదు ఘటన వల్ల సంగీత ప్రపంచానికి దూరమయ్యానని పేర్కొంది. తాను అత్యాచారానికి గురయ్యానని.. అంతటితో ఆగకుండా తనను కొంత మంది డ్రగ్స్ ఇచ్చి.. బంధీగా ఉంచుకున్నారని పేర్కొంది. ఆ దారుణ ఘటన నుంచి కోలుకోవడానికి అనేక రోజులు పట్టిందని వాపోయింది. ఆ తర్వాత తాను తన గొంతుతో మళ్లీ పాడతానో లేదో అనే అనుమానం వచ్చిందని.. అందుకే పూర్తిగా దూరమైపోయినట్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం చెప్పడం సరైన సమయమో కాదో తనకు తెలీదని.. కానీ చెప్పాలనిపించి చెబుతున్నానంటూ డఫీ పేర్కొంది.