72 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో తెరుచుకున్న వెయ్యేళ్ల హిందూ దేవాలయం..

| Edited By:

Jul 29, 2019 | 4:47 PM

సియాల్‌కోట్‌లో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ హిందూ దేవాలయాన్ని మళ్లీ తెరిచారు. ఈ ఆలయం దాదాపు 72 ఏళ్ల క్రితం మూసివేశారు. భారత్-పాక్ విభజన సమయంలో మూతపడిన ఆలయం మళ్లీ ఇప్పుడు తెరిచారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల ప్రకారం ఈ ఆలయాన్ని తెరుస్తున్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. సుమారు 1000 ఏళ్ల కిందల సర్దార్ తేజా సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. భారత్‌లోని బాబ్రీ మసీదును కూల్చివేసిన అనంతరం.. 1992లో ఓ […]

72 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో తెరుచుకున్న వెయ్యేళ్ల హిందూ దేవాలయం..
Follow us on

సియాల్‌కోట్‌లో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ హిందూ దేవాలయాన్ని మళ్లీ తెరిచారు. ఈ ఆలయం దాదాపు 72 ఏళ్ల క్రితం మూసివేశారు. భారత్-పాక్ విభజన సమయంలో మూతపడిన ఆలయం మళ్లీ ఇప్పుడు తెరిచారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల ప్రకారం ఈ ఆలయాన్ని తెరుస్తున్నట్లు పాక్ మీడియా వెల్లడించింది.

సుమారు 1000 ఏళ్ల కిందల సర్దార్ తేజా సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. భారత్‌లోని బాబ్రీ మసీదును కూల్చివేసిన అనంతరం.. 1992లో ఓ గుంపు ఈ ఆలయంపై దాడి ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఈ ఆలయం వద్దకు హిందువులు రావడం మానేశారు. అయితే.. పాక్ తాజా నిర్ణయంతో 72 ఏళ్ల క్రితం మూతపడిన ఆలయం మళ్లీ భక్తులకు అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా.. ఆలయంలో దెబ్బతిన్న భాగాలను కూడా పునరుద్ధరించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయాన్ని పరిరక్షించే పనులు కూడా ప్రారంభం అయ్యాయి.