Pakistan: రంజాన్ మాసంలో కారుచౌకగా నిత్యావసరాలు.. పాకిస్తాన్ లో ఓ సిక్కు యువకుని ఉదారత!

|

Apr 19, 2021 | 5:00 PM

పాకిస్తాన్ అంటేనే మతం గురించే బ్రతికే దేశం. అక్కడ విలువలు పెద్దగా ఉండవు. ప్రపంచం అంతా కరోనాతో విలవిలలాడుతోంది. పాకిస్తాన్ కూడా అదేవిధంగా కరోనా కోరల్లో చిక్కుకుని ఉంది. ఇప్పుడు రంజాన్ మాసం ప్రారంభమైంది.

Pakistan: రంజాన్ మాసంలో కారుచౌకగా నిత్యావసరాలు.. పాకిస్తాన్ లో ఓ సిక్కు యువకుని ఉదారత!
Pakistan Business Man
Follow us on

Pakistan: పాకిస్తాన్ అంటేనే మతం గురించే బ్రతికే దేశం. అక్కడ విలువలు పెద్దగా ఉండవు. ప్రపంచం అంతా కరోనాతో విలవిలలాడుతోంది. పాకిస్తాన్ కూడా అదేవిధంగా కరోనా కోరల్లో చిక్కుకుని ఉంది. ఇప్పుడు రంజాన్ మాసం ప్రారంభమైంది. కానీ, పాకిస్తాన్ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కుంటోంది. ఈ కష్టకాలంలో అక్కడి ప్రజలను ఆదుకోవాల్సిన నాయకులు తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారు. అయితే, అక్కడే స్థిరపడిన ఒక సిక్కు వ్యక్తి మాత్రం తన మానవతా వాదంతో అక్కడి వారి మనసుల్ని గెలుచుకున్నారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పని అతను అక్కడ చేస్తున్నాడు. చిన్న దుకాణం నడుపుకుంటున్న ఆయన తన పెద్ద మనసుతో అక్కడి ప్రజలకు సేవ చేస్తున్నాడు.

ఆయన పేరు నరంజన్ సింగ్. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో నివాసం ఉంటున్నారు. ఆయన అక్కడ చిన్న దుకాణం నడుపుతూ జీవిస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆయన తన దుకాణంలో వస్తువులను చాలా తక్కువ ధరలకు అక్కడి ప్రజలకు ఇస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆయన ఈ పని చేస్తున్నారు. దీంతో అక్కడ ఆయనను ప్రజలంతా ఎంతో గౌరవంగా చూస్తున్నారు. ఈ విషయం మీద ఆయన జియో న్యూస్ తొ మాట్లాడుతూ..”నేను ప్రతి రంజాన్ మాసంలోనూ ఈ విధంగా చేస్తుంటాను. ఈ నెల మొత్తం నా దుకాణంలో వస్తువులు లాభం గురించి చూడకుండా.. అతి తక్కువ ధరలకు ఇస్తాను. పదకొండు నెలలు లాభాల కోసం దుకాణం నడుపుతాం. కానీ, రంజాన్ నెలలో మాత్రం ప్రజల కోసం దుకాణం నడిపిస్తాను.” అంటూ చెప్పారు. రంజాన్ పవిత్రమాసంలో ఈవిధంగా చేయడం అంటే భగవంతునికి సేవ చేయడమే. దీనివలన వచ్చే లాభనష్టాలను నేను లెక్కచేయను అంటూ అయన చెప్పుకొచ్చారు.

అయితే, ఈయన చేసే పనికి ఇక్కడి ఇతర దుకాణాదారులు మండిపడుతున్నారు. వ్యాపారాన్ని పాడు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. కానీ, గత పదేళ్లుగా నరంజన్ సింగ్ ఇక్కడ దుకాణం నడుపుతున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా ఇదే పని చేస్తూ వస్తున్నారు. ఈ నెలలో దుకాణం అద్దె నుంచి.. ఆయన దగ్గర పనిచేసే వారి వరకూ అయ్యే ఖర్చులన్నీ ఆయన స్వంతంగా పెట్టుకుంటున్నారు.

Also Read: ఆయుర్వేదంతో కరోనాకు చెక్ పెట్టడం సాధ్యమేనా? పరిశోధకులు ఏం చెబుతున్నారో తెలుసా?

Coronavirus Incubation Period: వణికిస్తున్న కరోనా.. అసలు దీని ఇంక్యుబేషన్ కాలం ఎంత? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?