Saudi Arabia Corona: సౌదీ ఆరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌తో పాటు 20 దేశాలపై ఆంక్షలు

|

Feb 03, 2021 | 2:16 PM

Saudi Arabia Corona: కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో కట్టడి రాలేకపోతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాను ...

Saudi Arabia Corona: సౌదీ ఆరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌తో పాటు 20 దేశాలపై ఆంక్షలు
Follow us on

Saudi Arabia Corona: కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో కట్టడి రాలేకపోతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాను అరికట్టేందుకు సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు 20 దేవాశాలపై తాత్కాలిక ప్రయాణ ఆంక్షలను విధించింది. ఆంక్షల్లో భాగంగా ఈ 20 దేశాలకు చెందిన వారు సౌదీ ఆరేబియాలోకి అడుగు పెట్టేందుకు ఎలాంటి అనుమతులు ఉండవు. ఆరోగ్యశాఖ సూచన మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 3 నుంచి కొత్త ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ ఆంక్షల నుంచి దౌత్యవేత్తలను, వైద్య అభ్యాసకులు, వారి కుటుంబ సభ్యుఉలు, సౌదీ దేశస్థులను మినహాయిస్తున్నట్లు తెలిపింది.

సౌదీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన దేశాల జాబితా ఇదే..

భారత్‌, యూఏఈ, అర్జెంటినా, జర్మనీ, అమెరికా, ఇండోనేషియా, బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌, పాకిస్థాన్‌, ఈజిప్ట్‌, ఐర్లాండ్‌, ఇంటలీ, బ్రెజిల్‌, పోర్చుగల్‌, టర్కీ, స్వీడెన్‌, స్వట్జర్లాండ్‌, జపాన్‌, లెబనాన్‌ దేశాలున్నాయి.

కాగా, గడిచిన 14 రోజుల్లో ఈ దేశాల ద్వారా ప్రయాణం చేసిన ఇతర దేశస్థులపై కూడా ఆ ఆంక్షలు ఉంటాయని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే సౌదీలో ఇప్పటి వరకు 3.76 లక్షలకుపైగా కరోనా బారిన పడగా, 6,370 మంది మరణించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Also Read:

Osama Bin Laden- Nawaz Sharif: బిన్‌లాడెన్‌తో నవాజ్‌ షరీప్‌ సంబంధాలపై మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

Fake Vaccine: నకిలీ కరోనా వ్యాక్సిన్ల సరఫరా.. 80 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. 3వేల నకిలీ టీకాల స్వాధీనం