Russia, India Air Travel: ఈనెల 27 నుంచి భారత్‌, రష్యా మధ్య విమాన సర్వీసుల ప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌

Russia, India Air Travel: కోవిడ్‌ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొంచెం అదుపులోకి ...

Russia, India Air Travel: ఈనెల 27 నుంచి భారత్‌, రష్యా మధ్య విమాన సర్వీసుల ప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌

Updated on: Jan 23, 2021 | 7:05 PM

Russia, India Air Travel: కోవిడ్‌ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొంచెం అదుపులోకి వస్తుండటంతో కొన్ని దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాయ విమానాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. తాజాగా రష్యా ఈనెల 27 నుంచి అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు రెడీ అయింది. దీనిలో భాగంగా భారత్‌కు విమాన సర్వీసులు నడిపే దిశగా చర్యలు చేపట్టింది. భారత్‌తో పాటు ఫిన్లాండ్‌, వియత్నాం, ఖతార్‌కు కూడా రష్యా విమానాలు నడిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఉప ప్రధాని టటియానా గోలికోవా నేతృత్వం వహిస్ఉతన్న రష్యన్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ తాజాగా కీలక ప్రకటన చేసింది.

జనవరి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే భారత్‌కు కూడా విమానాలు నడపనున్నట్లు తెలిపింది. మాస్కో-ఢిల్లీ మధ్య వారానికి రెండు సర్వీసులు నడిపిస్తామని వెల్లడించింది. రష్యా ఫెడరల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు, విమాన సంస్థలకు మాస్కో నుంచి హనోయి, ఢిల్లీ హెల్సింకీ నగరాలకు వీక్లీ రెండు సర్వీసులు, రష్యా నుంచి దోహాకు వారానికి మూడు సర్వీసులను నడిపేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
కాగా, యూకేకు మాత్రం 2021 ఫిబ్రవరి 1 వరకు విమాన సర్వీసులు నడపబోమని స్పష్టం చేసింది. బ్రిటన్‌లో బయపడిన స్ట్రెయిన్‌ వైరస్‌ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్‌ 22 నుంచి ఆ దేశానికి రష్యా విమాన సర్వీసులను నిలిపివేసింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us