రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కోరిన ప్రధాని మోదీ.. స్పందించిన పుతిన్, ఉక్రెయిన్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని భారత్ చేస్తున్న దౌత్య ప్రయత్నాలపై అంతర్జాతీయ స్థాయిలో స్పందనలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి నుంచీ యుద్ధానికి బదులుగా చర్చలు, దౌత్యం ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన సమావేశాల్లోనూ ప్రధాని మోదీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కోరిన ప్రధాని మోదీ.. స్పందించిన పుతిన్, ఉక్రెయిన్
Pm Modi, Vladimir Putin

Updated on: Oct 02, 2026 | 7:19 AM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని భారత్ చేస్తున్న దౌత్య ప్రయత్నాలపై అంతర్జాతీయ స్థాయిలో స్పందనలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి నుంచీ యుద్ధానికి బదులుగా చర్చలు, దౌత్యం ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన సమావేశాల్లోనూ ప్రధాని మోదీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల బిష్కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా పుతిన్‌తో భేటీలోనూ ప్రధాని మోదీ అంతులేని యుద్ధానికి ముగింపు పలికి శాంతి దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీతో తాను సమావేశమైన ప్రతిసారీ ఉక్రెయిన్ వివాదాన్ని ముగించే అంశం ప్రస్తావనకు వస్తుందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నార. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలన్న ప్రధాని మోదీ వైఖరిని ఆయన గుర్తించారు. ఒక ఇంటర్వ్యూలో, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ప్రధాని మోదీ చేసిన ప్రయత్నాలను పుతిన్ ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుండటంతో శాంతి చర్చల విషయంలో ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా భారత్‌ను ‘గ్లోబల్ పవర్’గా అభివర్ణిస్తూ ప్రధాని మోదీ పిలుపును స్వాగతించారు. ‘అంతులేని యుద్ధం’ నుంచి ‘యుద్ధానికి ముగింపు’ వైపు వెళ్లాలన్న నరంద్ర మోదీ సందేశాన్ని స్వాగతిస్తున్నామని, దౌత్యానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. కీవ్‌లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశం అనంతరం సిబిహా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో జైశంకర్ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఉక్రెయిన్‌కు భారత విదేశాంగ మంత్రి చేసిన తొలి ప్రత్యేక ద్వైపాక్షిక పర్యటనగా సిబిహా పేర్కొన్నారు. రష్యా దాడులు, బ్లాక్ సీ నౌకాయానం, ప్రపంచ ఆహార భద్రత వంటి అంశాలపై ఇరువురు చర్చించారు.

జైశంకర్ కూడా భారత్ రష్యా, ఉక్రెయిన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. యుద్ధాన్ని తగ్గించేందుకు, సాధ్యమైతే ముగించేందుకు ఉపయోగపడే మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. పరిష్కారం యుద్ధభూమిలో కాకుండా చర్చలు, దౌత్యం ద్వారానే సాధ్యమవుతుందని భారత వైఖరిని పునరుద్ఘాటించారు. ఈ పరిణామాలతో రష్యా-ఉక్రెయిన్ వివాదంలో భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలపై అంతర్జాతీయ దృష్టి కొనసాగుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us