Russia – Ukraine War: రెండు నెలలైనా ఆగని యుద్ధం.. మేరియుపొల్ స్టీల్ ఫ్యాక్టరీపై రష్యా దాడులు

|

Apr 25, 2022 | 1:15 PM

ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై సరిగ్గా రెండు నెలలు గడుస్తున్నా.. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులు ఆగడం లేదు. ఉక్రెయిన్‌(Ukraine)లోని మేరియుపొల్‌ నగరంలో ఓ స్టీల్ ఫ్యాక్టరీపై రష్యా(Russia) సైన్యం ఆదివారం వాయుమార్గంలో...

Russia - Ukraine War: రెండు నెలలైనా ఆగని యుద్ధం.. మేరియుపొల్ స్టీల్ ఫ్యాక్టరీపై రష్యా దాడులు
Ukraine Russia War
Follow us on

ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై సరిగ్గా రెండు నెలలు గడుస్తున్నా.. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులు ఆగడం లేదు. ఉక్రెయిన్‌(Ukraine)లోని మేరియుపొల్‌ నగరంలో ఓ స్టీల్ ఫ్యాక్టరీపై రష్యా(Russia) సైన్యం ఆదివారం వాయుమార్గంలో దాడులకు పాల్పడింది. ఆ కర్మాగారాన్ని హస్తగతం చేసుకుంటే నగరమంతా తమకు దక్కినట్లేనని రష్యా భావిస్తోంది. అమెరికా(America) రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశం జరగనుండగా ఈ దాడులు జరగడం గమనార్హం. దేశం తరఫున పోరాడుతున్నవారి కోసం ఆదివారం ఉక్రెయిన్‌లో ఈస్టర్‌ ప్రార్థనలు నిర్వహించారు. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాల్లో రష్యా సైన్యం దాడులు అధికమయ్యాయి. ఈ దాడుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖేర్సన్‌లో రష్యాకు చెందిన కమాండ్‌ శిబిరాన్ని ఉక్రెయిన్‌ ధ్వంసం చేసింది. దీనిలో ఇద్దరు జనరళ్లు చనిపోయారని, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని సమచారం. అయితే ఈ విషయంపై రష్యా సైన్యం స్పందించలేదు.

దాడి సమయంలో దాదాపు 50 మంది సీనియర్‌ అధికారులు అక్కడ ఉన్నారు. ఉక్రెయిన్‌లో పేలుడు పదార్థాల ఫ్యాక్టరీని, అనేక ఆయుధాగారాలను, వందలకొద్దీ ఇతర లక్ష్యాలను క్షిపణులతో పేల్చివేసినట్లు రష్యా సైన్యం తెలిపింది. రక్షణ పరికరాల రూపంలో ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించనున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఫోన్లో మాట్లాడి, ఈ హామీ ఇచ్చారు. డ్రోన్లు, సురక్షితంగా సైనికుల కదలికలకు ఉపయోగపడే వాహనాలను సమకూరుస్తామని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

 Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్​అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..