15వ దలైలామాగా పుట్టపర్తి సత్యసాయి విద్యార్థి… వట్టి ఫేక్ న్యూస్!

| Edited By: Ravi Kiran

Jul 22, 2019 | 7:24 PM

15వ దలైలామాగా పుట్టపర్తిలోని సత్యసాయి ప్రైమరీ పాఠశాలకు చెందిన విద్యార్థి ఎంపికయ్యాడంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. సత్యసాయి పాఠశాల్లో 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల దావావంగ్డి 15వ దలైలామాగా ఎంపికయ్యాడంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని దలైలామా ఆఫీసు వట్టి పుకార్లు మాత్రమే అని కొట్టి పారేసింది. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, 15వ దలైలామాగా ఇంకా ఎవరిని ఎన్నుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా దావావంగ్డి […]

15వ దలైలామాగా పుట్టపర్తి సత్యసాయి విద్యార్థి... వట్టి ఫేక్ న్యూస్!
Follow us on

15వ దలైలామాగా పుట్టపర్తిలోని సత్యసాయి ప్రైమరీ పాఠశాలకు చెందిన విద్యార్థి ఎంపికయ్యాడంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. సత్యసాయి పాఠశాల్లో 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల దావావంగ్డి 15వ దలైలామాగా ఎంపికయ్యాడంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని దలైలామా ఆఫీసు వట్టి పుకార్లు మాత్రమే అని కొట్టి పారేసింది. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, 15వ దలైలామాగా ఇంకా ఎవరిని ఎన్నుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా దావావంగ్డి సత్యసాయి ప్రైమరీ పాఠశాలకు చెందినవాడే కాదని కూడా తేలింది. అతనికి సత్యసాయి స్కూల్‌తో ఏ మాత్రం సంబంధంలేదని స్పష్టమైంది.

పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన ప్రేమవంగ్డి,పంజూరాయ్‌ల కుమారుడు దావవంగ్డి కాగా.. 2016 లో అతన్ని ‘ద్రాక్త్సే రిన్పోచే’ అనే బౌద్ధ గురువు యొక్క అవతారమని 14వ దలైలామా గుర్తించినట్టు ఓ ప్రముఖ జాతీయ ఛానల్.. కథనంలో పేర్కొంది.  కానీ తననే ఇప్పుడు 15వ దలైలామాగా ఎన్నుకున్నట్టు  మాత్రం ఎక్కడా సమాచారం లేదు.