అమెరికా దళాలే లక్ష్యంగా.. ఇరాక్ స్థావరాలపై రాకెట్ దాడులు

| Edited By:

Jan 15, 2020 | 1:32 PM

అమెరికా దళాలే లక్ష్యంగా మరోసారి దాడులు జరిగాయి. ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై.. రాకెట్లతో దాడులు జరిగాయి. తాజీ స్థావరం వద్ద కత్యుషా రాకెట్లు ​పేలినట్లు.. ఇరాక్ ​మిలటరీ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. దాదాపు రెండు రాకెట్లు అమెరికా దళాలు ఉన్న స్థావరాల వైపు దూసుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎవరూ బాధ్యత వహించలేదు. కాగా.. గత ఆదివారం అల్ బలాద్ వైమానిక స్థావరంపై కూడా ఇదే […]

అమెరికా దళాలే లక్ష్యంగా.. ఇరాక్ స్థావరాలపై రాకెట్ దాడులు
Follow us on

అమెరికా దళాలే లక్ష్యంగా మరోసారి దాడులు జరిగాయి. ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై.. రాకెట్లతో దాడులు జరిగాయి. తాజీ స్థావరం వద్ద కత్యుషా రాకెట్లు ​పేలినట్లు.. ఇరాక్ ​మిలటరీ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. దాదాపు రెండు రాకెట్లు అమెరికా దళాలు ఉన్న స్థావరాల వైపు దూసుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎవరూ బాధ్యత వహించలేదు.

కాగా.. గత ఆదివారం అల్ బలాద్ వైమానిక స్థావరంపై కూడా ఇదే తరహాలో రాకెట్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య​ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి.. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై పలుమార్లు రాకెట్ల దాడి జరిగింది. ఇరాన్ ​అగ్ర కమాండర్.. ఖాసీం సులేమానీ హత్య తర్వాత.. అమెరికా సైన్యమే లక్ష్యంగా ఇరాన్​ క్షిపణి దాడులు చేసింది. అయితే మంగళవారం జరిగిన దాడి కూడా ఇరాన్ పనే అయ్యుంటుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.