పెరూలో భారీ భూకంపం.. నేలమట్టమైన ఇళ్లు

| Edited By:

May 27, 2019 | 4:52 PM

పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 8.0గా నమోదైనట్లు యూఎస్ భూగర్భ పరిశోధన సంస్థ తెలిపింది. భూ ఉపరితలానికి 110 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ సంస్థ పేర్కొంది. దక్షిణ అమెరికాలో భారీ భూకంపాలు సగటున 70 కిలోమీటర్ల లోతున చోటుచేసుకుంటుండగా, తాజా కేంద్రం ఏకంగా 110 కిలోమీటర్ల లోతున చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, ఉత్తర మధ్య పెరూలో తెల్లవారుజామున 2.41 నిమిషాలకు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. […]

పెరూలో భారీ భూకంపం.. నేలమట్టమైన ఇళ్లు
Follow us on

పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 8.0గా నమోదైనట్లు యూఎస్ భూగర్భ పరిశోధన సంస్థ తెలిపింది. భూ ఉపరితలానికి 110 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ సంస్థ పేర్కొంది. దక్షిణ అమెరికాలో భారీ భూకంపాలు సగటున 70 కిలోమీటర్ల లోతున చోటుచేసుకుంటుండగా, తాజా కేంద్రం ఏకంగా 110 కిలోమీటర్ల లోతున చోటుచేసుకోవడం గమనార్హం.

కాగా, ఉత్తర మధ్య పెరూలో తెల్లవారుజామున 2.41 నిమిషాలకు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టార్ స్కేల్ పై మొదట 7.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని పెరూ ప్రభుత్వం ట్విట్టర్‌లొ స్పందించింది. లిమా, కల్లవూ ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. సుమారు రెండు, మూడు నిమిషాల పాటు భూ ప్రకంపనలు రావడంతో జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీవ్ర ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు పేర్కొన్నారు.