సైబర్ బెదిరింపులు.. నటి, ప్రముఖ కుస్తీ క్రీడాకారిణి ఆత్మహత్య..!

| Edited By:

May 24, 2020 | 4:33 PM

సైబర్ బెదిరింపులు తట్టుకోలేక నటి, ప్రముఖ జర్మన్‌ యువ కుస్తీ క్రీడాకారిణి హనా కిమూరా(22) ఆత్మహత్య చేసుకుంది. దీంతో అక్కడి రెజ్లింగ్ ఆర్గనైజేషన్‌లో విషాదం నెలకొంది

సైబర్ బెదిరింపులు.. నటి, ప్రముఖ కుస్తీ క్రీడాకారిణి ఆత్మహత్య..!
Follow us on

సైబర్ బెదిరింపులు తట్టుకోలేక నటి, ప్రముఖ జర్మన్‌ యువ కుస్తీ క్రీడాకారిణి హనా కిమూరా(22) ఆత్మహత్య చేసుకుంది. దీంతో అక్కడి రెజ్లింగ్ ఆర్గనైజేషన్‌లో విషాదం నెలకొంది. రింగ్‌లో ఎంతో మంది ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఈ క్రీడాకారిణి.. నిజ జీవితంలో సైబర్‌ బెదిరింపులను తట్టుకోలేక ప్రాణం తీసుకోవడం తమను బాధించిందని రెజ్లింగ్ ఆర్గనైజేషన్‌ తెలిపింది. కాగా హనా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న పాపులర్ షో ‘టెర్రస్‌ హౌస్: టోక్యో 2019-20’ నటించారు.

ఆ షోలో ఆమె ప్రవర్తనపై గత కొన్ని రోజులుగా అభిమానుల నుంచి సైబర్ బెదిరింపులను ఎదుర్కొంటుందని, వాటిని భరించలేకనే హనా మరణించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. కాగా చనిపోయే ముందు హనా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ”రోజుకు 100కు పైగా అభిప్రాయాలు వస్తున్నాయి. వాటి వలన నేను ఇబ్బంది పడట్లేదు అని చెప్పడం అబద్ధం. వీటి వల్ల నేను చచ్చిపోయా. నాకు సపోర్ట్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ జీవితాన్ని నేను ఇష్టపడ్డా. కానీ నేను చాలా బలహీనురాలిని. క్షమించండి. ఈ జీవితాన్ని ఇంక నేను కొనసాగించాలనుకోవడం లేదు. అందరికీ థ్యాంక్స్‌. ఐ లవ్‌ యు. బై” అంటూ మెసేజ్‌ పెట్టింది. ఇక ఇన్‌స్టాలో చివరగా తన పిల్లితో తీసుకున్న ఫొటోను షేర్ చేసిన హనా.. ”ఐ లవ్ యు. క్షమించు” అని కామెంట్ పెట్టింది. కాగా పలు దేశాల్లో సైబర్‌ వేధింపులు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. దీని వలన చాలా మంది చిన్న వయసులోనే తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.

Read This Story Also: ‘కరోనా’ టెస్ట్ చేయించుకోలేదని బంధువుల దాడి.. వ్యక్తి మృతి..!