మోదీజీ ! చైనా దారి పట్టొద్దు .. జిన్ పింగ్ లా మారొద్దు !

|

May 28, 2019 | 4:42 PM

అయిదేళ్ల క్రితం మొదటిసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేబట్టినప్పుడు..ముంబై వాసులు మురిసిపోయారు. క్రోనీ కేపిటలిజం, అవినీతి, పాలసీకి పట్టిన ‘ చెదల ‘ ను అంతమొందించే సంస్కర్తగా భావించారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయనను బాస్ గా పొలిటికల్ కేపిటల్ (ఢిల్లీ) నెత్తిన పెట్టుకుంది. అయితే దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో మాత్రం ఆర్ధిక నిపుణులను ఇంకా సందేహాలువెన్నాడుతున్నాయి. అధికార కేంద్రీకరణ మరింత బలం పుంజుకుంటుందేమోనని వారిలో ఆందోళన తలెత్తుతోంది. ఇప్పటికే […]

మోదీజీ ! చైనా దారి  పట్టొద్దు .. జిన్ పింగ్ లా మారొద్దు !
Follow us on

అయిదేళ్ల క్రితం మొదటిసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేబట్టినప్పుడు..ముంబై వాసులు మురిసిపోయారు. క్రోనీ కేపిటలిజం, అవినీతి, పాలసీకి పట్టిన ‘ చెదల ‘ ను అంతమొందించే సంస్కర్తగా భావించారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయనను బాస్ గా పొలిటికల్ కేపిటల్ (ఢిల్లీ) నెత్తిన పెట్టుకుంది. అయితే దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో మాత్రం ఆర్ధిక నిపుణులను ఇంకా సందేహాలువెన్నాడుతున్నాయి. అధికార కేంద్రీకరణ మరింత బలం పుంజుకుంటుందేమోనని వారిలో ఆందోళన తలెత్తుతోంది. ఇప్పటికే మోదీని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో చాలామంది పోలుస్తున్నారు. జిన్ పింగ్ కఠిన విధానాలతో ఆ దేశంలోని ప్రయివేటు రంగం ఒడిడుకులను ఎదుర్కొంటోంది. రెండో సారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేబట్టిన అనంతరం ఆయన ఇండియాలో ప్రయివేటు రంగానికి స్వేఛ్చనిస్తారా లేక దాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారా అని నిపుణులు తర్జనభర్జన పడుతున్నారు. 2014 లో మోదీ పాలనలో కేవలం కొన్ని బాంకింగ్ సిస్టమ్స్, బడా వాణిజ్య సంస్థలు లాభపడ్డాయి. ఇప్పుడు చిన్న కంపెనీలు, ప్రాపర్టీ డెవలపర్లు సైతం అయోమయంలో పడ్డారు. మోదీ తాజా పాలన ఎలా ఉంటుందోనని ఈ వర్గాలన్నీ ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయం తగ్గడంతో వారు అప్పుల పాలవుతున్నారు. రైతుల ఆత్మహత్యల తాలూకు వార్తలు ఇంచుమించు రోజూ పత్రికల్లో దర్శనమిస్తున్నాయి. ఇక ప్రయివేటు ఇన్వెస్ట్మెంట్లు చాలాకాలం క్రితమే డీలా పడ్డాయి. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మోదీ విదేశీ ఇన్వెస్టర్లను… కాదు.. పొమ్మన్నారు. ఫలితంగా అప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చాలావరకు తగ్గిపోయాయి. దేశంలో పన్నుల వ్యవస్థను సరళీకృతం చేస్తామని హామీ ఇఛ్చిన అప్పటి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఈ-కామర్స్ పాలసీ కేవలం ముకేష్ అంబానీ వంటి బడా పారిశ్రామివేత్తలకే ప్రయోజనకారి అయింది. ఈ పరిణామాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం అప్పుడే అంచనా వేసింది. మళ్ళీ ఢిల్లీ పీఠం అధిరోహించిన తరువాత మోదీ.. కోట్లాది డాలర్లకు మార్గాన్నిసుగమం చేస్తున్న సరికొత్త నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ విశ్వసనీయతను పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జెట్ ఎయిర్ వేస్ వంటి కుదేలైన సంస్థలను నష్టాల బారి నుంచి బయట పడేసేందుకు 51 శాతం ప్రయివేటు ఫండ్లను వినియోగించుకోలేకపోవడం ఇక్కడ గమనార్హం.