పారిస్ చర్చి మంటల్లో ‘జీసస్ ప్రతిరూపం’.. నిజమేనా..?

| Edited By:

Apr 18, 2019 | 8:04 PM

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న పురాతనమైన చర్చ్.. నోట్రేడామే కేథడ్రల్. ఈ పురాతనమైన చర్చ్ సుమారు 800 సంవత్సరాల క్రితం నాటిది. అలాగే.. అత్యంత అపురూపమైన ఏసు ముళ్ల కిరీటాన్ని ఇక్కడ భద్రపరిచారని చెబుతారు. అలాంటి చర్చ్ ఇప్పుడు నామరూపాల్లేకుండా పోయింది. అయితే.. ఈ చర్చ్ మీద అభిమానంతో అనేక మంది మంటల్లో జీసస్ ప్రతిరూపాన్ని చూశామంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం విశేషం. కాగా.. ప్యారిస్‌లోని అగ్నికి ఆహుతైన ఈ నోట్రేడామే కెథడ్రల్ చర్చ్ పునర్నిర్మాణం […]

పారిస్ చర్చి మంటల్లో జీసస్ ప్రతిరూపం.. నిజమేనా..?
Follow us on

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న పురాతనమైన చర్చ్.. నోట్రేడామే కేథడ్రల్. ఈ పురాతనమైన చర్చ్ సుమారు 800 సంవత్సరాల క్రితం నాటిది. అలాగే.. అత్యంత అపురూపమైన ఏసు ముళ్ల కిరీటాన్ని ఇక్కడ భద్రపరిచారని చెబుతారు. అలాంటి చర్చ్ ఇప్పుడు నామరూపాల్లేకుండా పోయింది. అయితే.. ఈ చర్చ్ మీద అభిమానంతో అనేక మంది మంటల్లో జీసస్ ప్రతిరూపాన్ని చూశామంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం విశేషం.

కాగా.. ప్యారిస్‌లోని అగ్నికి ఆహుతైన ఈ నోట్రేడామే కెథడ్రల్ చర్చ్ పునర్నిర్మాణం కోసం భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దీని నిర్మాణానికి 7 వేల కోట్ల రూపాయల విరాళాలు అందాయి. నోట్రేడామే చర్చ్‌కు ప్రమాదవ శాత్తూ మంటలు అంటుకొని పైకప్పు పూర్తిగా దగ్ధమైంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పడంతో ప్రాణ నష్టం తప్పింది.