ఏశాట్‌ ప్రయోగంపై పెంటగాన్ ప్రకటన

| Edited By:

Apr 05, 2019 | 6:25 PM

భారత్ జరిపిన ఉపగ్రహ విధ్వంసక ప్రయోగం ఏశాట్‌తో ఏర్పడ్డ అంతరిక్ష వ్యర్థాలు క్రమంగా భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మరోసారి స్పష్టం చేసింది. ఏశాట్‌ ప్రయోగంపై మార్చి 28న స్పందించిన అమెరికా తాత్కాలిక రక్షణ కార్యదర్శి ప్యాట్రిక్ షనహన్ మాట్లాడుతూ.. భారత్ ప్రయోగంతో కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని స్పష్టం చేశారు. ఇదే ప్రకటనపై గురువారం మరోసారి స్పందిస్తూ.. దీనిపై గతంలో చేసిన […]

ఏశాట్‌ ప్రయోగంపై పెంటగాన్ ప్రకటన
Follow us on

భారత్ జరిపిన ఉపగ్రహ విధ్వంసక ప్రయోగం ఏశాట్‌తో ఏర్పడ్డ అంతరిక్ష వ్యర్థాలు క్రమంగా భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మరోసారి స్పష్టం చేసింది. ఏశాట్‌ ప్రయోగంపై మార్చి 28న స్పందించిన అమెరికా తాత్కాలిక రక్షణ కార్యదర్శి ప్యాట్రిక్ షనహన్ మాట్లాడుతూ.. భారత్ ప్రయోగంతో కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని స్పష్టం చేశారు. ఇదే ప్రకటనపై గురువారం మరోసారి స్పందిస్తూ.. దీనిపై గతంలో చేసిన వ్యాఖ్యలకే తాము కట్టుబడి ఉంటామని తెలిపారు.

అయితే ఏశాట్ ప్రయోగంపై ఇటీవల నాసా ఆందోళన వ్యక్తం చేసింది. ఏశాట్‌తో వెలువడ్డ శకలాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. దాని వలన వెలువడిన వ్యర్థాల వలన.. భవిష్యత్తులో అంతరిక్షంలోకి మానవులను తీసుకువెళ్లే ప్రయోగాలను నిర్వహించలేమని నాసా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెంటగాన్ ప్రకటనతో భారత్‌కు కాస్త ఊరట కలిగించేలా ఉంది.