భారత్ నిర్ణయంతో కశ్మీర్‌లో రక్తపాతమే..పాక్ విదేశాంగ మంత్రి కామెంట్స్

| Edited By:

Aug 05, 2019 | 7:05 PM

జమ్ము కశ్మీర్‌‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడంపై పాక్ నిప్పులు కక్కుతోంది. సోమవారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందడం, రాష్ట్రపతి ఆమోదం కూడా తెలపడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే జమ్ము కశ్మీర్ విషయంలో కేంద్ర తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కశ్మీర్‌లో రక్తపాతానికి దారితీస్తుందన్నారు. తమతో పాటు కశ్మీర్ నాయకత్వం కూడా అంగీకరించే పరిస్థితి లేదని తెలిపారు. […]

భారత్ నిర్ణయంతో కశ్మీర్‌లో  రక్తపాతమే..పాక్ విదేశాంగ మంత్రి  కామెంట్స్
Follow us on

జమ్ము కశ్మీర్‌‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడంపై పాక్ నిప్పులు కక్కుతోంది. సోమవారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందడం, రాష్ట్రపతి ఆమోదం కూడా తెలపడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే జమ్ము కశ్మీర్ విషయంలో కేంద్ర తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కశ్మీర్‌లో రక్తపాతానికి దారితీస్తుందన్నారు. తమతో పాటు కశ్మీర్ నాయకత్వం కూడా అంగీకరించే పరిస్థితి లేదని తెలిపారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దుపై పాక్ మీడియా కూడా భారత్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ప్రపంచమంతా కాశ్మీరీలకు అండగా నిలవాలని కోరింది.