పాక్‌లో ఘోర విమాన ప్రమాదం.. 17మంది మృతి

| Edited By:

Jul 30, 2019 | 9:29 AM

పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ సైనిక శిక్షణ విమానం కుప్పకూలిన ఘటనలో 17మంది మృతి చెందగా.. మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. రావల్పిండి సమీపంలోని గ్యారిసన్ సిటీలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం కుప్పకూలింది. మృతుల్లో ఐదుగురు జవాన్లు, 12మంది పౌరులు ఉన్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. శిక్షణలో భాగంగా చక్కర్లు కొడుతున్న […]

పాక్‌లో ఘోర విమాన ప్రమాదం.. 17మంది మృతి
Follow us on

పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ సైనిక శిక్షణ విమానం కుప్పకూలిన ఘటనలో 17మంది మృతి చెందగా.. మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. రావల్పిండి సమీపంలోని గ్యారిసన్ సిటీలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం కుప్పకూలింది. మృతుల్లో ఐదుగురు జవాన్లు, 12మంది పౌరులు ఉన్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. శిక్షణలో భాగంగా చక్కర్లు కొడుతున్న సమయంలో ఒక్కసారిగా నియత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ముందు కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయాయని.. అసలు కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.